కోహ్లీ ప్రదర్శించిన తీరు అద్భుతం : స్టీవ్‌స్మిత్‌

0

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఆస్ట్రేలియా మాజీ సారథి, బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ మెచ్చుకున్నాడు. ఈనెల 9న భారత్‌ X ఆసీస్‌ మ్యాచ్‌లో టీమిండియా అభిమానులు స్మిత్‌ను ఉద్దేశించి ‘మోసగాడు’ అంటూ స్టేడియంలో అరిచిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా కోహ్లీ అభిమానులకు సైగ చేస్తూ అలా అనొద్దని చెప్పాడు. దీంతో అభిమానులు స్మిత్‌ను వెక్కిరించడం మానేశారు. తర్వాత కొద్దిసేపటికే స్మిత్‌, కోహ్లీ కరచాలనం చేస్తూ స్టేడియాన్ని వీడారు. 

మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీమిండియా అభిమానుల తరఫున ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ సోమవారం ఆ దేశ పత్రిక సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ తో మాట్లాడుతూ కోహ్లీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నాడు. ‘ఆ సమయంలో కోహ్లీ ప్రదర్శించిన తీరు అద్భుతం.. నిజం చెప్పాలంటే అభిమానులు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఆ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోతున్నా’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

బాల్‌ టాంపరింగ్‌ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరమైన స్మిత్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడేందుకు నేరుగా ప్రపంచకపలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో స్మిత్‌ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేసిన స్మిత్‌ అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here