కోచింగ్ కేంద్ర భ‌వ‌నాల‌ఆక‌స్మిక త‌నిఖీ

0

న‌గ‌రంలోని  అన్ని కోచింగ్ కేంద్రాలు, విద్యా సంస్థలు అగ్నిప్ర‌మాద నివార‌ణ ప‌రిక‌రాల‌ను విధిగా ఏర్పాటు చేసుకోఆల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆదేశించారు. అమీర్‌పేట్‌, మైత్రీవ‌నం ప‌రిస‌రాల్లో ఉన్న కోచింగ్ కేంద్రాల భ‌వ‌నాల‌ను నేడు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అమీర్‌పేట్ లో ఉన్న కోచింగ్ సెంటర్ల‌లో వేలాది మంది ప‌లు శిక్ష‌ణ‌ల‌ను పొందుతున్నార‌ని, వీరంద‌రి భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అన్నారు. ప్ర‌తి భ‌వ‌నంలో విధిగా అగ్నిప్ర‌మాద నివార‌ణ ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. కోచింగ్ సెంట‌ర్లు నిర్వ‌హిస్తున్న భ‌వ‌నాల్లో ఫైర్ సేఫ్టి గురించి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌పై అన్ని భ‌వ‌నాల‌ను త‌నిఖీ చేసి నివేదిక స‌మ‌ర్పించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని ఆదేశించారు. కాగా నేడు ఉద‌యం అమీర్‌పేట్‌లోని ప‌లు కోచింగ్ సెంట‌ర్ల భ‌వ‌నాలలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్ర‌తి భ‌వ‌నంలోని కోచింగ్ సెంట‌ర్ల‌లో ఫైర్ సేఫ్టి చ‌ర్య‌ల‌ను క‌మిష‌న‌ర్‌ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఖైర‌తాబాద్ డిప్యూటి క‌మిష‌న‌ర్ గీతారాధిక‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here