Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

కేసీఆర్ కాళ్ళు మొక్కి పదవులిప్పిస్తా

కార్యకర్తలనుకంటికి రెప్పలా కాపాడుతా నియోజకవర్గంలో 55 వేల సభ్యత్వాల నమోదు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు (ఆదాబ్ హైదరాబాద్) ః  పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు లభిస్తుందని, ఖచ్ఛితంగా పదవి అవకాశాలు వస్తాయని, కార్యకర్తల కోసం  ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్ళు మొక్కైనా పదవులు ఇప్పిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్  గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతమైన నాయకత్వం, పటిష్ఠమైన క్యాడర్ గల పార్టీ అనీ ఆయన చెప్పారు. తనకు రెండవ సారి ఎమ్మెల్యేగా, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకవచ్చిన ఘనత టీఆర్ఎస్ కార్యకర్తలదేనన్నారు. ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేదిలేదని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్ చెరు పట్టణ శివారులోని జీఎమ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలో 55,200 సభ్యత్వాలు నమోదైయ్యాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోనే సభ్యత్వ నమోదులో నియోజకవర్గం మొదటి స్థానంలో ఉన్నదని, ఇది కార్యకర్తల కృషితోనే సాధ్యపడిందన్నారు. సభ్యత్వాలకు సంబంధించిన మొత్తం రుసుము రూ.40,48,000/-లను పార్టీకి అందజేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో దాదాపుగా 90 శాతం గ్రామ, మండల, పట్టణ, డివిజన్  కమిటీల ఎంపిక పూర్తయిందని, మిగతా 10 శాతం త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఆయా మండలాలో సమావేశాలు నిర్వహించి, కమిటీలను ప్రకటించాలని పార్టీ నాయకులకు సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని, త్వరలో జరగబోయే మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకోని గులాబి జెండా ఎగురువేద్దామన్నారు. ప్రతి 6 నెలలకొకసారి కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నామని, కార్యకర్తల, గ్రామాల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గతసారి చేసిన అభివృద్ధి కంటే ఈ ఐదేండ్లలో మరింత అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పదవులు చాలా ఉన్నాయని, పదవులు రానివారు ఏమాత్రం నిరాశ చెందకూడదని అర్హులైన కార్యకర్తలందరికీ పదవులు ఇప్పించే బాధ్యత తనదేనని  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయని, అందులో 60 కౌన్సిలర్లు ఉంటారన్నారు. దీనితో పాటు ఆత్మ, దేవాలయ, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్, కార్పొరేషన్  లాంటి బోలెడన్ని పదవులు ఉన్నాయని, అందులో కష్టపడే కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ ఛైర్మెన్ కుంచాల ప్రభాకర్, జడ్పీటీసిలు బి.సుప్రజ వెంకట్ రెడ్డి, గంగుల సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్, కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, వి.ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసి కొలన్ బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు నాలకంటి యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు దశరత్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, మల్లారెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మెన్ గడీల కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బి.చంద్రశేఖర్ రెడ్డి, తులసీ రెడ్డి,  పట్టణ అధ్యక్షులు బి.విజయ్ కుమార్, పరమేష్ యాదవ్, దేవేందర్ చారి,  నాయకులు జి.మాణిక్య ప్రభు,  బొర్రా వెంకట్ రెడ్డి, సద్ది విజయ  భాస్కర్ రెడ్డి,  బూరుగడ్డ నగేష్, గోవర్ధన్ రెడ్డి, బాసిరెడ్డి నర్సింహ్మా రెడ్డి, బసవేశ్వర్, గిద్దె నర్సింహ్మా, నర్రా భిక్షపతి, మక్బూల్, ఎండీ మేరాజ్ ఖాన్, ఎంపీటీసిలు, సర్పంచ్ లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close