రాజకీయ వార్తలు

కేసీఆర్‌, జూపల్లికి గుబులు

కొల్లాపూర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జి భిరం హర్షవర్ధన్‌ రెడ్డి, నియోజకవర్గ నాయకులు ఏపాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాగ్రహ బహిరంగ సభ గద్వాల్‌ జేజమ్మ,ఓసై రాములమ్మ ప్రసంగాలతో మండుటెండలో ప్రజలు వేలాదిగా వీక్షించారు. కేసీఆర్‌, జూపల్లి గుండెలో గుబులు పుట్టించారు.శుక్రవారం పట్టణంలోని రాజా బంగ్లా ముందు నిర్వహించిన ప్రజాగ్రహ సభ జనసంద్రంగా మారిపోయింది. ముందుగా డి.కె. అరుణ, విజయశాంతి, బట్టి విక్రమార్క, సలీం రోడ్‌షో నిర్వహించారు. ముందుగా సభాను భిరం హర్షవర్ధన్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రావు జూపల్లి పై విరుచకబడ్డారు. జూపల్లి నిర్వహించిన కొల్లాపూర్‌ సంబరా లకు అయిన ఖర్చు ఎవ్వరి జేబులో నుంచీ తీసుకున్నవి అన్నారు. అఖిలభారత ప్రచార కార్యదర్శి సలీం మాట్లా డుతూ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన కేంద్రంలోబిజేపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలను నట్టెట ముంచాయి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తూందన్ని రాహుల్‌గాంధి ప్రధానమంత్రి అవుతారన్నారు. అనంతరం మాజీ మంత్రి గద్వాల్‌ జేజమ్మ డి.కె. అరుణ మాట్లాడుతూ జూపల్లి కష్ణారావుకు ఎమ్మేల్యే, మంత్రిగా రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రేస్‌ పార్టీని అవమానించేలా చేస్తున్న ఆరోపణలు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేలా ఉన్నాయని డి.కె. అరుణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జూపల్లికి తగిన బుద్ధి చెప్పి గద్దే దించాలన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ట్రంలో కేసిఆర్‌ ఇటు జూపల్లి అధికారంలోకి వచ్చి ఇసుక మాఫియాలకు బ్యాంక్‌ దోపిడులకు పాల్పపడుతున్నారన్ని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తు న్నారన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్‌ నియోజక వర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి కాలేదన్ని ప్రశ్నిస్తూ కేవలం కమీషన్ల కక్కూర్తి కొరకే జూపల్లి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పై జూపల్లి చేసిన తప్పు ఆరోపణలపై ఘాటుగ సమాధానం ఇచ్చారు డి.కె. అరుణ. భీమ, నెట్టంపాడు, జూరాల ప్రాజెక్టులను పూర్తి చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండ సోమశీల సిద్ధేశ్వర వంతేన నిర్మాణం కొరకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌. రాజాశేఖర్‌ రెడ్డి బడ్జెట్‌ కేటాయించి మంజూరు చేయలేదా అన్ని జూపల్లిని ముక్కుసూటిగ ప్రశ్నించారు. గత ఇరవైఏళ్లుగా మంత్రిగా, ఎమ్మేల్యేగా ఉంటూ 98 జిఓ భూ నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదన్ని ప్రశ్నించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివద్ధిని మరచి గద్వాల్‌ వైపు ఎందుకు చూస్తున్నావని ఎద్దెవా చేశారు. డి.కె. అరుణ చేసిన అభివద్ధిని చూసి నేర్చుకో అన్ని జూపల్లికి సూక్తులు పలికారు. కొల్లాపూర్‌కు బస్టాండ్‌, డిగ్రీ కాలేజ్‌, అభివద్ధి చేసింది కాంగ్రేస్‌ ప్రభుత్వమే అని పలికారు. అటు రాష్ట్రంలో కేసిఆర్‌ ఇటు జూపల్లి ప్రజలను బానిసలుగా మార్చారు అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్‌ ఎన్నికల ముందు కేసిఆర్‌ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నేరవేర్చలేదు అన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్ని ఇచ్చిన హామిలు నేరవేర్చకుండ ఏ ముఖం పెట్టుకొని మళ్ళి ప్రజలను ఓట్లు అడుగుతారన్ని ప్రశ్నించారు. వచ్చేది తెలంగాణలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అన్నారు. తదనంతరం రాములమ్మ విజయశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలనలో బడుగుబలహీన వర్గాల ప్రజలు బానిస బతుకుగా మారారు అన్నారు. కేసిఆర్‌ ఐదు ఏళ్ళు పాలించడానికి చేతకాక నాల్గు ఏళ్ళకే ముందస్తు ఎన్నికలకు పోతున్నారన్నారు. ఉధ్యమం పేరుతో తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నాల్గు వేళ్ళ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దొరల పాలనకు చమర గీతం పలకాలన్ని ప్రజలకు పిలుపు నిచ్చారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం మామిడి పండ్లకు ప్రసిద్ధిగాంచింది అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయకుండ ఇసుకమాఫియాలకు పాల్పపడుతూ ప్రాజెక్టులలో అవినీతులకు పాల్పపడుతున్నారన్ని ఆరోపించారు. జూపల్లి కుటుంబంలో ఇసుక మాఫియాకు పాల్పపడిన వ్యక్తిని దాచిపెడుతున్నారన్నారు. కాంగ్రేస్‌ పార్టీ అధికారంలో వస్తే జూపల్లిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం కేసిఆర్‌, కొల్లాపూర్‌లో జూపల్లి ఓటుతో బుద్ది చెప్పి దొరల పాలన తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కేసిఆర్‌ ప్రభుత్వం బహుజనులను మోసం చేసిందన్నారు. మైనార్టీలకు 12% కల్పిస్తామన్ని నమ్మించి మోసం చేశరన్నారు. కొల్లాపూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పెట్టిన బిక్షతో అధికారంలో వచ్చిన జూపల్లి తెలంగాణ సెంటిమెంట్‌తో 2014లో గెలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ నాయకులకు, అటు కేసిఆర్‌, ఇటు జూపల్లికి తగిన బుద్ది చెప్పుతారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తూందన్ని రాహూల్‌ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న అందరికి వద్ధాప్య ఫించను 2000 రూపాయలుఅందిస్తామన్నారు. మనిషికి 7 కిల్లోల సన్న బియ్యం ఇస్తామన్నారు. కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ కంచుకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేసి పూర్వ వైభవం తీసుకవస్తామన్నారు. అంతకుమందుకు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఓబేదుల కొత్వాల్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపి నంది ఎల్లయ్య ప్రసంగించారు. వేపురి సొమ్మన జూపల్లి, కేసీఆర్‌ల పై పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close