కేరళను వణికిస్తున్న‘నిఫా’ వైరస్

0

 కేరళ రాష్ట్రాన్ని ‘నిఫా’ వైరస్ వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో కేరళ వైద్య శాఖ మంత్రి కేకే శైలజ కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలిసి ‘నిఫా’ అంటు వ్యాధి ప్రబలకుండా తోడ్పాటునందించాల్సిందిగా కోరారు. కేంద్ర వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్దన్‌ను ఆమె తొలుత అభినందించారు. అనంతరం ఇరువురూ కొంత సేపు చర్చించారు. సమావేశానంతరం కేరళ మంత్రి కేకే శైలజ మీడియాతో మాట్లాడుతూ 21 ఏళ్ళ కళాశాల విద్యార్థికి నిఫా సోకినట్లు గుర్తించామన్నారు. అయితే ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె తెలిపారు. ఇంకా 321 మందికి నిఫా సోకిందేమోనన్న అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. నిఫా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. ఇంకా నిఫాను ఎదుర్కొవడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇదివరకే ఆరుగురితో వైద్య బృందాన్ని పంపించిందని, ఐసీఎంఆర్ నిపుణులు కూడా చేరుకున్నారని ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here