కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనం

0

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబురాలు అట్టహాసంగా మొదలయ్యాయి, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాన్ని గోల్కొండలోని శ్రీ జగదంబిక అమ్మవారికి సమర్పించిన తరువాత ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మార్గదర్శకంతో, ట్యాంక్ బండ్ పై గల కట్ట మైసమ్మ తల్లికి 516 బోనాలను కుండలలో సమర్పించారు. 516 బోనాలతో కూడిన శోభయాత్రను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారి సతీమణి తాడూరి శ్రీలత గారికి తొలి బోనంను ఎత్తి శోభ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ట్యాంకు బండ్ మీదుగా కట్ట క్రింద గల కనకాల కట్ట మైసమ్మ దేవాలయం వరకు సాగింది.

కార్యక్రమంలో ఎం బి సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బి సి వెల్ఫేర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం , సికింద్రాబాద్ తలసాని సాయి కిరణ్ యాదవ్, బిసి అడిషనల్ సెక్రటరీ నాయక్ , ఎంబిసి సీఈఓ ఆలోక్ కుమార్, బి సి గురుకులాల సెక్రటరీ మల్లయ్య బట్టు, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయంత్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు నగేష్, రాజమల్లయ్య, దాయానంద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here