Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలువార్తలు

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ

దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది గంటలలోనే ప్రధాని మోడీ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయ కంపెనీలు, నూతన తయారీ రంగ సంస్థలకు కార్పొరేట్‌ పన్నులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయమని అన్నారు. వ్యాపారం చేయడానికి భారత్‌ను అనువైన దేశంగా మలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి గత కొద్ది వారాలుగా తాము తీసుకుంటున్న చర్యలే నిదర్శనమే అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను మెరుగుపరిచి, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని ఓ ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు చారిత్రాత్మకం. మేక్‌ ఇన్‌ ఇండియాకు ఉద్దీపన కలిగించి, ప్రపంచ దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, ప్రైవేటురంగంలో పోటీతత్వాన్ని పెంచడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం, తద్వారా 130 కోట్ల భారతీయులను విజేతలుగా నిలబెట్టేందుకు ప్రభుత్వ చర్య ఉపకరిస్తుంది’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కార్పొరేట్స్‌కు పన్ను బొనంజాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన కొద్ది గంటలకే మోదీ ఈ ట్వీట్‌ చేశారు. వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను 22 శాతానికి తగ్గించామని, నూతన తయారీ రంగ సంస్థలు 15 శాతం పన్ను చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close