కాంగ్రెస్ వాళ్ళకు భూమి ఎంతుందో తెలియదు.

0

◆ కాంగ్రెస్ కు రెండే సీట్లు
◆ ప్రాజెక్టులపై కాంగ్రెస్ కు అవగాహన లేదు
◆ కోటి ఎకరాలకు నీరిస్తాం
◆ కుటుంబ పాలనకు ఓకే

(వాటర్ బోర్డు ఛైర్మన్ వి ప్రకాష్ తో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

ఓ జర్నలిస్టుకు కేసు విషయంలో జరిగిన చిన్న సంఘటనతో… మనస్సు నొప్పి కలిగిందని
ఆయన న్యాయవాద వృత్తిని వదిలేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మీడియా ద్వారా భావజాలం ప్రజలకు అందించారు. ఆయన స్నేహశీలి. స్నేహం కోసం సౌమ్యంగా ముందుకు సాగుతారు. అందరూ ఆప్యాయంగా ‘ప్రకాశన్న’ అని పిలుచుకునే ఆయనే ప్రకాశ్. నీటి ప్రాజెక్టుల విషయంలో విశేష అనుభవం ఉంది. అయితే ఆశాఖలో వేలకోట్ల అవినీతి జరిగిందని అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాటిని గురించి ‘ఆదాబ్ హైదరాబాద్’తో సవివరంగా మనసు విప్పి స్పష్టంగా మాట్లాడారు.

? ప్రాజెక్టుల ఎస్టిమేషన్లు పెంచారనే విమర్శలపై మీ స్పందన.?

● కాళేశ్వరం ప్రాజెక్టుకు రాజశేఖర్ రెడ్డి 17 కోట్లు పెట్టారు. 2008 1 సంవత్సరంలో 37 కోట్లు చేశారు. 1 ఏడాదిలో రెట్టింపు అయితే 10 ఏళ్ళలో రెట్టింపు కాదా..

– అంటే రీ డిజైనింగ్ ని సమర్థించుకుంటారా..?
● అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు వేరు ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు వేరు. కొన్ని మార్పులు తప్ప ఆరోజు ఉన్న డిజైన్ ప్రకారం కొన్ని ప్యాకేజీలు తప్ప అన్నీ మారాయి. ఉదాహరణకు ఎక్కువ ఖర్చు రిజర్వాయర్, వాటర్ స్టోరేజీకి అవుతుంది. అది తప్పుకాదు.

– రీడిజైన్ ఎందుకు అవసరమైంది..?

● అప్పుడున్న సిడబ్ల్యుసి మీరు 160 టిఎంసీలు వాడుకుంటామని చేవెళ్ళ వరకు… 16లక్షల ఎకరాల వరకు వాడుకుంటామని డిజైన్ చేశారు. 160 టిఎంసీలు లేవు అందుబాటులో100 టిఎంసీలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 60 టిఎంసీలు మీ సొత్తు కాదు. పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి మీకు వస్తున్నాయి. భవిష్యత్తులో అది కుదరదు. పదివేల ఎకరాలకు ఒక టిఎంసీ నీరు వాడకం జరుగుతుంది. అస్సలు 160 టిఎంసీల దాకా ఎందుకు… ఎక్కడ పెట్టుకుంటారు. అప్పటి ప్రభుత్వం కేవలం రిజర్వాయర్ కెపాసిటీ 16 టిఎంసీలకు సరిపడే స్టోరేజికి మాత్రమే ఉండగా… మీరు 160 టిఎంసీల స్టోరేజికి సంబంధించి అడిగితే ఎలా ప్రశ్న వచ్చింది.

– అందుకే రీ డిజైన్ చేశారా..?

● ప్రాణహిత దగ్గర ఉన్నాయి. బ్యారేజీ కట్టాల్సిన తుమ్ముడి హట్ట్ దగ్గర సాంచురీ ఉంది. అనుమతులు రావు. అక్కడ సర్వే చేయలేదు. అవేవీ చేయకుండా చేవెళ్ళ దగ్గర కాలవులు తీశారు. నీళ్ళు ఆపుకునే దగ్గర తట్టెడు మన్ను తీయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు.

– అంటే కాంగ్రెస్ నాయకులు తప్పు చేశారా..?

● అవును చాలా తప్పులు చేశారు.
‘కాలువలు వస్తున్నాయి. నీళ్ళొస్తున్నాయి’ అని భూముల రేట్లు పెంచారు. ఈలోగా అక్కడ నీటి వ్యవస్థను చిద్రం చేశారు.

కొత్త కాంట్రాక్టర్లు వచ్చారా..?

● రీడిజైన్ లో మనం కొత్త కాంట్రాక్టర్లను తీసుకురాలే. కొత్త ప్యాకేజీలలో తెచ్చాం. ఆంధ్రా కాంట్రాక్టర్లకు వారిచ్చిందే. కాంట్రాక్టర్ల అర్హత. చూడాలి కానీ… ఒరిస్సా, ఢిల్లీ, ముంబై.. ప్రాంతాలు ఉండవు కదా..! టెండర్లలో భారతీయ పౌరుడైతే చాలు. 83 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు చేయడానికి ఒకరిద్దరికి మించి అర్హతగల వారు తెలంగాణలో లేరు. ఉన్నవారికి మిషనరీ లేదు. ఇతర ఎక్యూప్ మెంట్ లేదు. ఎవరు తక్కువకు టెండర్ వేస్తే వారికే పనులు అప్పగించడం జరిగింది.

– కోటి ఎకరాలకు నీళ్ళు మ్యానిఫెస్టోలో ఉంది..?

ప్రజలకు మాట ఇచ్చాం. అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేకంగా ఒకొక్క రూరల్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని, మొత్తం తెలంగాణలో కోటి ఎకరాలకు మా ప్రణాళికా ధ్యేయం.

కాంగ్రెస్ వేరే చెపుతోంది కదా..?

● కాంగ్రెస్ అధికార ప్రతినిధి
శ్రావణ్ కి భూమి ఎంతుందో తెలియదు. అంత భూమి ఎక్కడున్నది అంటాడు. తెలంగాణలో భూ విస్తీరణం నైసర్ఘిక పరిస్థితుల ప్రకారం రెండు కోట్ల డెబ్బై లక్షల ఎకరాలపైనే ఉంటుంది. అందులో కోటి డెబ్బై లక్షల ఎకరాల సాగునీటికి బనికొచ్చే భూమి ఉంది. విత్తనాలు వేస్తున్న భూమి కోటి పన్నెండు లక్షల భూమి ఉంది. కేసీఆర్ పవర్ ప్రజంటేషన్ లో చెప్పారు. ఒకొక్కసారి అదనంగా మరో పది నుంచి పదిహేను లక్షల వరకు వెళుతుంది. నీటి పారుదల ద్వారా సాగు చేస్తుంది యాభై లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న నీటి సదుపాయంతో పదహారు లక్షలే ఎకరాలు ఉంది. మరో ముప్పై లక్షల భూమి బోరు బావుల ద్వారా రైతులు కష్టపడి చేస్తున్నది. ప్రభుత్వం కరెంటు మాత్రం ఇస్తుంది. ఈ మాత్రం అవగాహన వారికి లేదు. విత్తనం వేయని భూమి మరో యాభై లక్షలు ఉంది. కొత్తగా కోటి ఎకరాలకు రావు. అదివరకు ఉన్న వసతులతో కలుపుకొని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఖర్చుతో ఇప్పుడు16లక్షల ఎకరాలకే నీరు అందుతుంది. 1956లో కూడా అంతే ఉంది. పాతవి పాడైనవి. కొత్తవి నిర్మించుకున్నాం. నాగార్జునసాగర్ కాస్త శ్రీరాం సాగర్ అయింది.

? నాలుగు అంచెల విధానం గురించి చెప్పండి ?

● పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాం. రెండోది ఇప్పుడున్న ప్రాజెక్టులను ఆధునీకరించుకుంటూ రీ డిజైనింగ్ చేశాం. మూడోది చాలా కొత్తవి ప్రారంభిస్తున్నాం. ఇక నాల్గవది..ముఖ్యమైంది ఉదాహరణకు
నిజాంసాగర్ ఆయకట్టు 2లక్షల 31 వేయి ఎకరాల సాగు భూమి ఉంది. ఎప్పుడూ 30 లేదా 40 వేల ఎకరాలకు మించి నీరందదు. దీన్ని స్థిరీకరించడం. కల్వకుర్తికి రి డిజైనింగ్ అవసరమైంది. మీం వచ్చిన తరువాత మరో లక్ష ఎకరాలను సాగులోకి తెచ్చాం.

– ఆయకట్టల గురించి..?

● కాళేశ్వరం రి డిజైనింగ్ లో రిజర్వాయర్లు పెంచడానికి, ఆయకట్టు పెంచడానికి కొత్త ఆయకట్టు 14 నుంచి16 లక్షలైంది. ఘనపూర దగ్గరున్న మంజీర ఆయకట్టు, దానికింద ఉన్న 20 వేల ఆయకట్టు, నిజాంసాగర్ ఆయకట్టు కడెం ఆయకట్టు, 16 లక్షల శ్రీరాం సాగర్ మేజర్ ఆయకట్టు కలిపి 38 లక్షల ఆయకట్టు అయింది. ఎక్కడ 16, ఎక్కడ 38 ఆలోచించండి.

– నదుల పునర్జీవం గురించి.. కేసీఆర్ కల నిజమౌతుందా..?

● గోదావరి నది పునర్జీవం 140 కిలోమీటర్ల స్టాండ్ బై వాటర్ 36 టిఎంసీల నీరు.. అందుబాటులో ఉంటుంది. వాళ్ళకు ..
బేసిక్ గా కాంగ్రెస్ వాళ్ళకు నీటిపారుదలపై ఆవగాహన లేదు. చివరకు రాహుల్ గాంధీకి కూడా లేదు. ఒక్క కాళేశ్వరం తోటే కేసీఆర్ కల 1/3 పూర్తవుతుంది. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలున్నాయి. 30, 35 వరకు కొత్త ప్రతిపాదనలు చేయగలిగాం.

-ఎన్నేళ్ళు పడుతుంది..?

● కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి మరో నాలుగేళ్ళు పడుతోంది.
2022 నాటికి కోటి కల సాకరమౌవుతోంది.

– సుస్థిరమైన ప్రభుత్వాన్ని మధ్యలో రద్దు చేయడంపై..?

● రాజ్యాంగ పరమైన హక్కు అది. అది ఉపయోగించుకుంటున్నాం. అన్ని ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు. అసెంబ్లీని నడవనీయడం లేదు. ప్రతిసారి సస్పెండ్సే కదా.. ‘వీళ్ళపై ప్రజాకోర్టులో తేల్చుకుందాం’ అనుకున్నాం. ఒక్క కాళేశ్వరం పైనే 170-180 కేసులు వేశారు. అన్ని ప్రాజెక్టులపై కూడా కోర్టుకు వెళ్ళారు. గ్రీన్ ట్రిబ్యునల్ ని సైతం వదల్లేదు.

– వంద వస్తాయంటున్నారు..?

● కేసీఆర్ నూటా ఐదు టార్గెట్ పెట్టుకున్నారు. 105 తెరాస, మిత్రపక్షమైన మజ్లీస్ 7, భాజపాకు 5.. కాంగ్రెస్ కు రెండు సీట్లు వస్తాయి.

– తెరాస జాబితాలో మార్పులుంటాయా..?

● కేసీఆర్ ప్రకటించిన105లో తాజా సర్వేలో వ్యతిరేకత ఉందని తెలిస్తే..తప్పక మార్పులుంటాయి. బి ఫాం ఇచ్చే వరకు ఒక స్పష్టత ఉంటుంది.

– వ్యతిరేకత ఎన్ని సీట్లలో ఉందను కుంటున్నారు.?

● 10 -15 సీట్లలో వ్యతిరేకత ఉంది. చివరి నిమిషంలో గెలుపు ఓటములు బేరీజు వేసుకుంటున్నాం. అవసరాన్ని బట్టి మార్పులు.ఉంటాయి.

– మిగిలిన రాజకీయ పార్టీలను తుడిచేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు.?

● ప్రజాస్వామ్య దేశంలో అది అసాధ్యం. ప్రతిపక్షాలకు ఓటిమి భయం పట్టుకుంది. అందుకే అలా మాట్లాడుతున్నారు.

? ధర్నా చౌక్ విషయం.?

● ధర్నా చౌక్ విషయం తెరాస ది కాదు. అధికారుల ప్రతిపాదన. నడక వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటిది కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పడిది. అది ఇందిరా పార్కు విషయంలో ఇది. మిగిలిన విషయాలలో పోలీసులు, కోర్టులు అనుమతిస్తున్నాయి. వాయస్ నొక్కేయలంటే కోదండరాం ఒక్క మీటింగ్ అడ్రస్ చేయలేకపోయేవారు. ఒక్క ఇందిరా పార్కు దగ్గర తప్ప మిగిలిన అన్ని చోట్ల ఆయన సభలకు అనుమతులున్నాయి.

– ఎన్ కౌంటర్ల పై ..?

● ఇప్పటి వరకు సుమారు 3వేల మందిని నాటి పాలక పక్షాలు చంపాయి. తెలంగాణ ప్రభుత్వంలో కేవలం రెండు సంఘటనలు జరిగాయి. అందులో ముగ్గురు మాత్రమే చనిపోయారు. అదీ తప్పనిసరి ఎదురుకాల్పులు జరిగితే తప్ప ఎలాంటి సంఘటనలు ఉండకూడదని పోలీసులకు ఆదేశాలు వెళ్ళాయి. అక్రమ అరెస్టులు లేవు. పౌరహక్కుల నేతలను ఇతర సెక్షన్ల పేరుతో నెలల తరబడి జైళ్ళలో ఉంచిన సందర్భాలు లేవు. ఇది స్వేచ్ఛ కాదా.. ఎన్ళకౌంటర్ చేసిన చేతులతోనే నేడు చేతులు కలిపారు.

– ఉద్యమాలు జరగకుండా అణచివేతలపై…?

● కేసీఆర్ అస్సలు సమస్యలు లేకుండా చూస్తున్నారు. అందుకే ఉద్యమాలు లేవు. గతంలో ఖాళీ బిందెలతో ప్రదర్శనలు ఉండేవి. ఇప్పుడు సమస్యలు లేవు కాబట్టి బిందెల చప్పుడు లేదు.

– పౌరహక్కులు బ్రహ్మాండంగా ఉన్నాయని భావిస్తున్నారా..?

● ప్రతిపక్షాలు ప్రగతిభవన్ వద్ద ఆందోళన చేసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వదిలేసేవారు. కరెంటు సమస్య లేదు. గతంలో పరిశ్రమలకు హాలిడే ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలు లేవు.

– పోలీసు వ్యవస్థను ప్రజాప్రతినిధులు చేతుల్లోకి తీసుకున్నారని ఎఫ్ఐఆర్ కావాలంటే అక్కడి ప్రజా ప్రతినిధులు చెపితే కాని జరగని దుష్ఠాంతాలున్నాయి..?

● హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉంది. పార్టీ బలోపేతం కోసం ఇతర నాయకులు వచ్చారు. పదవులు కావలసిన వారు వచ్చి చేరారు. వారి అవసరం పార్టీకి ఉంది. పార్టీ అవసరం వారికుంది. మ్యూచివల్ బెనిఫిట్ కోసం జరిగింది. అలా వచ్చిన వాళ్ళలలో చెడ్డవాళ్ళు కూడా ఉండి ఉంటారు. తప్పక ఈ ఎన్నికల తరువాత పార్టీ వారి గురించి ఆలోచన చేస్తుంది.

– అవినీతి లేదని, అస్సలు జరగలేదని చెపుతారా..?
● ప్రపంచ వ్యాప్తంగా అవినీతి విస్తరించింది. తెలంగాణలో కూడా ఉంది. కేసీఆర్ ఐదేళ్ల, పదేళ్ల పాలనలో తుడుచి పెడుతుందని చెప్పను. కాని నియంత్రించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు.

– స్థానిక ప్రతినిధులు పోలీసు వ్యవస్థను, ఇతర ప్రభుత్వ శాఖలపై పెత్తనం చెలాయించారనే ఆరోపణలుపై..?

● అలా జరిగినట్లు తెలిసిన ప్రతిసారి కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకునేవారు. మీడియా కూడా బాగానే ఇలాంటి వ్యవహారాలపై చురుగ్గా ఉంది.

– పోలీసుశాఖకు సంబంధించిన ఫైళ్ళు గల్లంతు కావడం, ఆ అధికారులపై చర్యలు తీసుకోకపోవడం జరిగింది..మా వద్ద ఆధారాలున్నాయి.?

● జరిగి ఉండవచ్చు. ఒకరిద్దరి వ్యవహారాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి. తప్పక చీఫ్ సెక్రటరీతో మాట్లాడతాను. ప్రభుత్వం తప్పుడు అధికారులను ప్రోత్సాహించదు.

-హరీష్ రావు ఒంటరి అనే వార్తలపై..?

● అదేం లేదని హరీష్ రావు స్వయంగా స్పందించారు. పార్టీలో అందరం కలసి పనిచేస్తున్నారు.

– కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈ ప్రయత్నమా..?

● భారతీయ సంస్కృతిలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్న రాముడు దగ్గర నుంచి ఉంది. కుటుంబ పారనకు నేనేం వ్యతిరేకం కాదు. కేటీఆర్ కొడుకుగా 2009లో పోటీ చేసినప్పుడు 173 ఓట్ల మెజారిటీ రాగా, అనంతరం జరిగిన ఎన్నికల్లో 50 వేల మెజారిటీ వచ్చింది. ఆయన పనితీరు బాగుంది. యువకుడిగా ఆయన ఆలోచన విధానం బాగుంది.

కేసీఆర్ మీడియాను మేనేజ్ చేస్తున్నారని… ?

● మిమ్మల్ని మేనేజ్ చేశామా..? చేయగలమా..? మీరు గత కొన్నేళ్లుగా అనేక కుంభకోణాలు వెలుగులోకి తెచ్చారు. వాటిమీద చర్యలు తీసుకున్నాం. సుమారు పదేళ్లుగా మీ పరిచయం ఉంది. ఎప్పుడైనా ఎవరితోనైనా సర్థుకు పోయారా..? మీడియాను మేనేజ్ చేయడం అబద్దం.

కేసీఆర్ ‘దళిత ముఖ్యమంత్రి’. మాటపై..:
ఇంకా మనకు పూర్తి తెలంగాణ రాలేదు. సెక్షన్8 గవర్నర్ చేతిలో ఉంది. షెడ్యూల్ 9,10 కొనసాగుతున్నాయి. షీలా బేడీ, కమలనాథ్ కమిటీలు పనిచేస్తున్నాయి. హైకోర్టు విభజన జరగలేదు. ఉద్యోగస్థుల సమస్య అలాగే ఉంది. రేపు మోడీ , చంద్రబాబులు కలసి తెలంగాణ ప్రయోగం విఫలమైంది. అంటూ తిరిగి కలిపే ఆయుధం కేంద్రం చేతిలో ఉంది. 15 ఏళ్ళు కేసీఆర్ వాళ్ళతో ఏగాడు. కాబట్టి వాళ్ళ జిత్తులు తెలిసిన వ్యక్తిగా సిఎం పదవికి ఆయన కరెక్ట్. ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యం.

ఇంతలో సిఎం కేసిఆర్ నుంచి ఫోన్ రావడంతో ఆదాబ్ హైదరాబాద్ సెలవు తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here