Featuredస్టేట్ న్యూస్

కాంగ్రెస్‌ ను పాతిపెట్టే ‘కోవర్ట్‌ కుట్ర’ ఎక్కడ..?

– ¬టల్‌ బిల్లులు చెల్లించింది ఎవరు..?

– స్క్రాప్‌ పోయింది

– కొత్త నాయకులకు సారథ్యం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ… ఆ పార్టీని భూస్థాపితం చేసే కుట్ర విజయవంతంగా అమలవుతోంది. అసలు ఈ కుట్ర ఎక్కడ జరిగింది. ఎవరు చేశారు. ఎందుకు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇక్కడే పథకరచన:

హైదరాబాద్‌ లో పార్కు పేరుతో ఉండే ¬టల్‌, అందులో గది నెం. 319. విలాసవంతమైన, విశాలమైనది. నాలుగు బెడ్లు, కనీసం10 మంది కూర్చుని సంభాషణలు జరుపుకోవచ్చు. ఈ ఖర్చులు న్నీ ఇటీవల కారెక్కిన ఓ కాంగ్రెస్‌ సీజన్‌ వారీ నాయకుడు భరింంచేవాడు. 2015 నుంచి గులాబీ పార్టీ నుంచి ఎంపీ టికెట్‌ ఆశించిన టిపిసిసిలోని కీలక వ్యక్తి. భూ దందాలలో బాగానే కూడబెట్టుకున్నాడని ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌ నుంచి ప్లేట్‌ ఫిరాయిద్దామని చూశాడు. అనుకున్నట్లుగా కారు నుంచి కూతలు రాలేదు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయాలని తెగ తాపత్రయం పడ్డాడు. ఈయన గురించి గులాబీ నేత ఆలోచించినట్లుగానే ఏఐసీసీ కూడా ఆలోచించింది. ఏ పార్టీ నమ్మక… రెండింటికి చెడ్డ రేవడిలా ..చివరకు ‘నారాయణ… నారాయణ’ అంటూ కాలక్షేపం చస్తున్నారు.

ఎంత చేతులు మారింది:

ఈ మొత్తం వ్యవహారం జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌ ను ఖాళీ చేసే కోవర్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. ఇందులో స్థాయిని బట్టి

50 లక్షల నుంచి మూడు కోట్ల వరకు బేరసారాలు కొనసాగాయి. అందులో కొందరు వాహనాలు కొనుగోలు చేశారు. మరికొందరు రెండో ఇంటి వారయ్యారు. ఇంకొందరు సరిహద్దు రాష్ట్రాల్లో ఎకరాల కొద్ది భూమి కొనుగోలు చేశారు.

ముద్దొచ్చే బామ్మర్దులు:

ఈ నాయకులకు బినావిూలుగా వారి బామ్మర్దులను ఎంచుకోవడం విశేషం. ఇటీవలే పార్టీ మారి ఎంపీగా పోటీచేసిన ‘నా’యకుడు మూడో వ్యక్తిగత పరిచయం ఉన్న మహిళను బినావిూగా ఉంచారు. ఇలా పార్టీలు మారిన ఉద్దండులు మాత్రం బంగారం కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

స్క్రాప్‌ పోయింది:

కాంగ్రెస్‌ పార్టీలో అన్ని పదవులు, అధికారం అనుభవించిన నాయకులతో పట్టుమన పదిమంది కార్యకర్తలు మారలేదు. దీంతో కారెక్కి బిత్తర చూపులు చూసే వారి సంఖ్య పెరిగింది. దీనికి తోడు తమ పార్టీలో చెత్త (స్క్రాప్‌) పోయిందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

కొత్త నాయకత్వం:

కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్థుతం ఉన్న వారంతా… సంప్రదాయ బద్దంగా కొనసాగుతున్న కుటుంబాల వారే అధికం. ఈ కారణంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కొత్త తరం వచ్చే అవకాశం ఉంది. అంటే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను మెయిన్‌ స్ట్రీమ్‌ నాయకులుగా చూడవచ్చు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close