Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

కర్నాటక ఉప పోరు వాయిదా..

ఉప ఎన్నికలపై ఇసి అనూహ్య నిర్ణయం

  • ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
  • సుప్రీంలో కేసు ఉన్నందుననే అని వెల్లడి

న్యూఢిల్లీ

కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెలలో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయనున్నట్టు భారత ఎన్నికల సంఘం పేర్కొంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈసీ ఈ మేరకు వెల్లడించింది. అనర్హత వేటును సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 22కు వాయిదా పడింది. వాస్తవానికి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్నాటక ఉపఎన్నికలను కూడా ఒకే దశలో నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో అక్టోబర్‌ 21 జరిగే ఉపఎన్నికలపై స్టే విధించాలని లేదా తమను ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలని కోరుతూ అనర్హతకు గురైన కర్నాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత విధించడం వంటి అంశాలపై ఎలా వ్యవహరించాలన్న దానిపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కర్నాటక స్పీకర్‌ సుప్రీంకోర్టును కోరారు. దీంతో కర్ణాటక ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. 15 స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్‌ 22న కోర్టు వాదనలు విననున్నది. కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా 17 మంది ఎమ్మెల్యేల విూద అప్పటి స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం విదితమే. ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగిసే వరకు వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీంతో ఈ వివాదం న్యాయస్థానంలో ఉన్నందున అది పూర్తయ్యే వరకు తాము 15 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించబోమంటూ సుప్రీంకోర్టుకు సీఈసీ తెలియజేసింది. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్‌పై తాము పూర్తిగా విచారణ జరుపుతున్నామని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తాము కూడా ఎన్నికలను వాయిదా వేస్తామని ఈసీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉప ఎన్నికలు వాయిదా వేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని రెబల్‌ ఎమ్మెల్యేలు కోర్టుకు తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close