Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

ఓటాన్‌ అకౌంట్‌ – బడ్జెట్‌ తేడా 36వేల కోట్లు

కేటాయింపుల్లో తేడాలు

? కేంద్రంపైకి నెపం

? 24వేల కోట్ల ఆర్థక లోటు మాటేంటీ..?

? 5ఏళ్ళలో సంపద ఎలా రెట్టింపు..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ కు సోమవారం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఏకంగా 36వేల కోట్ల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఆర్థిక మాధ్యమం గురించి సమాచారం ఉండటంతౌ బడ్జెట్‌ రూప’కల్పన’ జరిగింది. మరి మొన్నటి ఎన్నికలకు ముందే కదా ఓటాన్‌ అకౌంట్‌ పెట్టింది. అప్పుడేమో ఓట్లపై ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని భయపడి…సందేహపడి… కలతపడి…కలవరపడి… ఎడాపెడా కేటాయింపులు చూపించేశారు.

మొన్న అలా.. నేడు ఇలా..:

ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ 1.82 లక్షల కోట్లకు ఎలా పెరిగింది?? అకస్మాత్తుగా సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఏకంగా 36 వేల కోట్లు తగ్గిపోయింది. 1.46 లక్షల కోట్లకు ఎలా చేరుకుంది..? అదేమంటే..? వాస్తవిక బడ్జెట్‌ అంటారు. తీరా ఇప్పుడు… ‘అంత సీన్‌ లేదు’ అంటూ ఏకంగా 36 వేల కోట్లకు తగ్గించేశారు.

అసలు కథేమిటీ అంటే..?:

ఇన్నేళ్లూ ఆహా ఓ¬ అన్నట్టుగా ఆదాయ వృద్ధి రేటునే అసలు ప్రగతి వృద్ధి రేటుగా గొప్పులు చెప్పుకున్నది ప్రభుత్వం. కానీ మొన్నటి వార్షిక ఆదాయాల తీరు చూసి, షాక్‌ తిన్నది. కొన్నింటిలో లోటు. దీనికి కారణం మోడీ విధానాలే.. ‘ఆర్థికమాంద్యమే’ అని సూత్రీకరించేస్తున్నది ఇప్పుడు? ఈ బడ్జెట్‌ అంటకత్తెరల అసలు వ్యవహారం అదే.

ఏమిటో మరి..:

ఏడాదికి 1.82 లక్షల ఆదాయం అంచనా వేసుకున్నారు. సరే, ఆ మోడీ ఆర్థిక విధానాలు, ఆర్థిక మాంద్యం దెబ్బతీస్తాయని లెక్కేసి, నాలుక కర్చుకుని, దాన్ని 1.46 లక్షల ఆదాయానికి మార్చుకున్నారు. (ఇప్పటిలాగే)? కానీ ఇప్పటికే మరో 24 వేల రూపాయల ఆర్థిక లోటు కనిపిస్తూనే ఉంది. ఐనా సరే, చివరాఖరుకు విూ జేబులో 2 వేల రూపాయల నగదు మిగులుతుందని లెక్కవేశారు. పిచ్చి లేస్తున్నదా..? ఈ లెక్కల తీరు? అవును, బడ్జెట్ల లెక్కలు అలాగే ఉంటయ్‌.

మూలధన వ్యయం?మురిపెం:

24 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా కూడా అంచనా వేసుకున్నారు. ఇవెలా సాధ్యం..? ఏముంది..? అప్పులు చేయడమే..! లేదా భూముల్ని అమ్మేసుకోవడమే. అచ్చంగా తెలంగాణ తాజా బడ్జెట్‌ కూడా ఇలాగే? ఎంతగా నేలవిూదికి దిగివచ్చినట్టుగా చెబుతున్నా? ఇప్పటికీ నేలవిడిచి సాము చేస్తున్నట్టుగానే ఉంది.

ఇంకా లోతుల్లోకి వెళ్తే..:

ఆ ఆర్థిక పరిభాష చాలామందికి అర్థం కాదు? అంత ఎందుకు ఆ అసెంబ్లీలో కూర్చున్న ఆ ప్రజాప్రతినిధుల్లో ఎంతమందికి ఈ బడ్జెట్‌ లెక్కలు అర్థమవుతాయి. సరే? ఏడాది చివరలో ఏ శాఖకు ఇంకా ఎంత కత్తెర ఉండబోతున్నదో వదిలేస్తే? ఆ గొప్పలు దేనికి..? అయిదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయ్యిందట?!ఎలా..? రాష్ట్ర సంపదను ఎలా లెక్కించారు..? ఎవరు లెక్కించారు..? రాష్ట్ర తలసరి ఆదాయమా..? జీఎస్డీపీయా..? అదేనా తమరు చెప్పే వృద్ధి రేటు..? ఆమధ్య మోడీ ప్రభుత్వం కూడా ఈ లెక్కింపు ప్రామాణికాలు మార్చింది కాబట్టి, ఈ తలసరి ఆదాయం లెక్కలు ఎడాపెడా పెరిగినట్టుగా ప్రజల్ని భ్రమింపజేస్తున్నాయి. ఇక వ్యవసాయంలో వృద్ధి రేటు మస్తు పెరిగింది అంటున్నారు కదా..! అసలు మత్స్య, పౌల్ట్రీ, లైవ్‌ స్టాక్‌ ఆదాయాల్ని లెక్కించటానికి ఈరోజుకూ సరైన ప్రామాణికాలే లేవు కదా? మన ఇష్టం? ఐటీ ఎగుమతుల్లో వృద్ధి అంటున్నాం, నిజమేనా..? తగ్గిన రూపాయి విలువతో కృత్రిమంగా కనిపించే పెరుగుదల కాదా అది..? ఇలా బోలెడు? ఏతావాతా చెప్పుకోదగింది ఏమిటంటే? కేసీయార్‌ కాస్త నేల విూదకు దిగొచ్చాడు? పనిలోపనిగా మోడీ ఆర్థికవిధానాల పుణ్యమాని, తలెత్తిన ఆర్థికమాంద్యమే తన బడ్జెట్‌ కత్తెరకు కారణం అంటూ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో చెబుతున్నాడు? అవును, మరి రాజకీయ సవిూకరణాలు మారినప్పుడు, బడ్జెట్‌ లెక్కల మార్పులకు కారణాలూ మారతాయి కదా?! ఏది ఏమైనా… బడ్జెట్‌ పెట్టాం అని పించేశారు. సరే…! రేపటి అప్పులకుప్ప పరిస్థితి ఏమిటి..? మన యువరాజు రాకపోతాడా…? మన ఆర్థిక కష్టాలు తీర్చరా..? వేచిచూద్దాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close