Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

ఓటర్ల సహాయక కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి

మహబూబాబాద్(ఆదాబ్ హైదరాబాద్).జిల్లాలోని ఓటర్ల సులభతరం కొరకు మహబూబాబాద్ లోని తహసిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటర్ల నమోదు సహాయక కేంద్రాన్ని  కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్ శివలింగయ్య ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ వి ఎస్ పి ఆన్లైన్ పోర్టల్లో తన ఓటును పరిశీలించుకొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా ఎన్నికల కమిషన్  ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా ఈనెల 1వ తేదీ నుండి  30వ తేదీ వరకు ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటు ను నమోదు చేసుకోవచ్చన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో బి ఎల్ ఓ లు అందుబాటులో ఉంటారని, తమ ఓటును వారి వద్ద కూడా పరిశీలించు కోవచ్చు అన్నారు.ఓటర్లు ఓటరు జాబితాలో తమ వివరములను మరియు తమ కుటుంబ సభ్యుల వివరములను బూత్ లెవల్ అధికారి వద్ద , సంబంధిత తహశీల్దార్ కార్యాలయములో మరియు సంబంధిత ఓటర్ల నమోదు అధికారి వద్ద ” ఓటర్ హెల్ఫ్ లైన్ ” మొబైల్ యాప్ ( నా ఓటు యాప్ ) ద్వారా , NVSP పోర్టల్ ద్వారా మరియు ” కామన్ సర్వీస్ సెంటర్ ” ను ( మీ సేవ కేంద్రాలను ) సందర్శించి పరిశీలన చేసుకొనవచ్చుని. ఓటరు పేరు , ఫోటో , చిరునామా , వయస్సు మరియు తదితర వివరాలు తప్పుగా నమోదైనచో  సరైన ఆధారములను దాఖలు చేసి సవరించుకొనవచ్చునని కలెక్టర్ తెలిపారు. 1950 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి కూడా తమ సమాచారమును తెలుసుకొనవచ్చునని,1 జనవరి 2020 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులయిన వయోజనులు అందరూ క్రొత్తగా ఓటు నమోదు కొరకు పైన పేర్కొన్న ఆప్ – లైవ్ వెబ్ – సైట్ల ద్వార నిరంతరముగా ఎప్పుడైననూ ధరఖాస్తు చేసుకొనవచ్చనని తెలిపారు.              1వ తేదీ నుండి  30వ తేదీ వరకుఇంటింటి  బూత్ లెవెల్ అధికారుల ద్వార సర్వే చేపడుతున్మట్లు,   ఓటర్లు తమ వద్ద గల ఆధారాలను చూపించి వారి ఓటును ద్రువీకరించుకొవాలని , చనిపోయిన ఓటర్ల వివరాలు , గ్రామము విడిచి వెళ్ళిన వారి వివరాలు , ఓటరుగా నమోదు కాని వారి వివరాలు సేకరిస్తారని,  ప్రజలందరూ సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు సహకరించాలన్నారు.  అర్హులైన వయోజనులందరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.అనంతరం కలెక్టర్ మొబైల్ యాప్ ( నా ఓటు యాప్ )  గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కొమురయ్య, ఇంచార్జి తహసీల్దార్ రంజిత్, ఎన్నికల తహశీల్దార్ రాంబాబు, డిటి రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close