Featuredజాతీయ వార్తలు

ఒకవైపు వడగాలులు.. మరోవైపు మెదడువాపు రోగులు..

  • బీహార్‌లో పిట్టల్లా రాలుతున్న జనం..
  • శ్రీకృష్ణా మెడికల్‌ కాలేజ్‌లో పరిస్థితి దారుణం
  • 15రోజుల్లో 84మంది చిన్నారులు మృతి
  • కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌ గ్రేషియా
  • స్పందించని సీఎం నితీష్‌కుమార్‌

బీహార్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. బీహార్‌లో మెదడువాపు వ్యాధితో మరో పది మంది చిన్నారులు మరణించారు. దీంతో కేవలం 15 రోజుల్లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 84కు చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది 10 ఏండ్లలోపు వారే ఉన్నారు. మరోవైపు మండే ఎండలతో ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బీహార్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మరణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణ మెడికల్‌ కాలేజ్‌, దవాఖాన.. ఓ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కేజ్రీవాల్‌ దవాఖానలో చోటుచేసుకున్నాయి. వేసవి కావడంతో పాటు మండే ఎండల కారణంగా హైపోగ్లిసిమియా అనే బ్రెయిన్‌ ఫీవర్‌ చిన్నారులకు సోకుతుందని ఈ ఫీవర్‌తో మెదడు దెబ్బేనని దీని ప్రభావంతో పక్షవాతం, కోమా ఏర్పడటం వంటి అవకాశాలున్నాయని 15 ఏళ్లకు లోబడిన వారు ఈ వ్యాధి సులభంగా సోకుతుందని దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని..బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వీరిని పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్యమంత్రి ఎదుట కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల మృతి వైద్యుల నిర్లక్ష్యం కూడా కారణమే అని మండిపడుతున్నారు. మరోవైపు ఈ పరిస్థితిపై బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్పందించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే..ముఖ్యమంత్రి కార్యాలయం మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. శ్రీకృష్ణా మెడికల్‌ కాలేజ్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఎటు చూసినా చిన్నారులు..ఇతర రోగులతో ఆస్పత్రి కిటకిటలాడిపోతుంది. ఇక్కడే 197మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మరో ఆస్పత్రిలో 91మంది చిన్నారులు మెదడువాపు వ్యాధి లక్షణాలతో అడ్మిట్‌ అయ్యారు. చికిత్స పొందుతున్నవారు కానీ..మరణించిన వారికి కానీ మెదడువాపు వ్యాధి కారణం కాకపోవచ్చని చాలామందిలో షుగర్‌ లెవల్స్‌ పడిపోయి చనిపోతున్నారని కొందరు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ కూడా చెప్పారు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మెదడు పని తీరుపై ప్రభావం చూపుతాయని చెప్పారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఎండ వేడికి తాళలేక ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య 40మందికి చేరింది. కారణాలేవైనా సరే..బీహార్‌లో ఇప్పుడు చిన్నారుల మరణాలు ఆందోళనకరంగా మారాయి. ఇవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

మంచి చికిత్స అందించండి లేదా చంపేయండి

బీహార్‌ రాష్ట్రంలో మెదడు వ్యాపు వ్యాధి లక్షణాలతో చాలా మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. పలు ఆస్పత్రుల్లో భయానక వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ చూసిన ఓ వ్యక్తి చలించిపోయాడు. తన సోదరుడు రెండు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు..చాలా మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.. ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణ మెడికల్‌ కాలేజీలో మెదడు వ్యాపు లక్షణాలతో ఉన్న చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఇదే ఆస్పత్రిలో తన సోదరుడు గత రెండు నెలలుగా చికిత్స పొందుతున్నాడని..వెంటనే సరైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా చికిత్స తీసుకుంటున్న ఎంతో మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సరియైన వైద్యం అందించాలి..లేనిపక్షంలో తనను చంపేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకులపై అతను ఫైర్‌ అయ్యాడు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాడు. ఈ విషయంలో తాను ఎవరి పేర్లను తీయడం లేదని..ఒకవేళ తీస్తే తన సోదరుడిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనే అవకాశం ఉందని వెల్లడించాడు. మరోవైపు బీహార్‌ రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతోంది. మెదడు వ్యాపు వ్యాధితో ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. జూన్‌ 16వ తేదీ ఆదివారం వరకు 84 మంది చిన్నారులు మృతి చెందారని తెలుస్తోంది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. సీఎం నితీష్‌ కుమార్‌.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close