Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఏం సాధించారని శిలలపై శిల్పాలు..

అమరుల ఆత్మ ఘోషిస్తుందీ..

శిలలపై చెక్కాల్సిన ఘనతేముందీ..

సుదీర్ఘ పేరుకోసం శిలలపై శిల్పాలు..

వంశానికే అరిష్టమంటున్న పండితులు.

రాజ్యంలో ప్రశ్నించే గొంతులు మూగపోయాయి.. స్పందించే మేధావులు మౌనమునులుగా మారిపోయారు.. ప్రతిఘటించే ప్రజాసంఘాలను పత్తాలేకుండా చేశారు.. నినదించే జనాలు వారికున్న పుట్టెడు బాధలతోనే సతమతమవుతున్నారు.. పనులు లేక, పథకాలు రాక, జీతాలు లేక, వైద్యం అందక, విద్యం కుశించి, బంగారు తెలంగాణ సర్వం బాధల తెలంగాణగా, సమస్యల తెలంగాణగానే మారిపోయింది.. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే రాజు ప్రజలను మరిచిపోయి రోజులు కాదు, నెలలు కాదు, ఇప్పుడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు కూడా రాజ్యంలో రాజు ఉన్నాడని, ప్రతిరోజు సచివాలయానికి వస్తున్నాడని, ప్రజల సమస్యలపై స్పందిస్తున్నాడనే విషయాలను మరిచిపోయారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని దాదాపుగా మరిచిపోయారు.. ఏరికోరి ప్రాణాలను ఫణంగా పెట్టి, కోట్లాడి తెచ్చిన తెలంగాణలో అందరూ నన్ను మరిచిపోతున్నారని తెలంగాణ రాజ్య అధినేత భావించినట్లున్నారు. అందుకే యాదాద్రి ఆలయాలలోని స్తంభాలపై తన చిత్రాలను శాసనాలు వేయించుకుంటున్నారు. ప్రజల సమస్యలు వింటూ, ప్రజల అభివృద్దికి పాటుపడుతూ, ప్రజలు మదిలో మరపురాని మహనేతగా ఎదగాల్సిన అవసరాన్ని ఇప్పుడు మన పాలకులు మరిచిపోయారు. అందుకే ప్రజల అభివృద్ది, సమస్యల కంటే తన పేరే చరిత్రలో, మరో వెయ్యి సంవత్సరాలపాటు స్థిరస్థాయిగా నిలవాలని ఆలోచనతో ఉన్నారని అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రానికే వన్నెతెచ్చేలా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం నిర్మాణంలోని స్తంభాలపై తన చిత్రంతో పాటు, పార్టీ గుర్తు, పథకాలు ఎందుకు వేపించుకుంటున్నారో ఎవ్వరికి అంతుబట్టడం లేదు. చరిత్రలో ఎంతోమంది రాజులు వారు ప్రజలకు చేసిన త్యాగాలకు ఫలితంగా శాసనాలు వేయించుకునే వారు, కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న రాజు చేసిన త్యాగమేమిటో, జరిగిన అభివృద్ది ఏమిటో చెప్పాలని ఉద్యమకారులు మండిపడుతున్నారు… రాజ్యం చేతిలో ఉంటే ప్రజలతో సంబంధం లేకుండా తనకు నచ్చిందీ మాత్రమే చేస్తూ సామాన్యుడు కలలుగన్న బంగారు తెలంగాణను కలగానే మార్చిన ఘనత ఇప్పుడు మన పాలకులకే దక్కుతోంది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

కొన్ని సంవత్సరాలు ఏరి, కోరి మరీ తెచ్చుకున్న తెలంగాణ నేడు ఏమయిందో, ఎవరి పాలిస్తున్నారో అర్థం కావడం లేదు.. అధికార పార్టీలో ఉన్న నాయకులే తెలంగాణ రాకముందుకు, తెలంగాణకు వచ్చాక రాష్ట్రంలో వచ్చినా మార్పు ఏమి లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా అదే గుడిసెలు, అదే రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో మన రాష్ట్రం మనకు రావాలని కోట్లాడుతే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. నిధులు లేక పథకాలు ఆగిపోయినవి. జీతాలు రాక ప్రవేట్‌ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యరంగం మొత్తం వ్యాపారం రంగంగా మారిపోయింది. వైద్యం అందకు పేదవాళ్ల ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అతుకుల బంతగా, అప్పుల కుంపటిగా మారిపోయింది. సమస్యలతో ప్రజల ప్రాణాలు పోతున్నా పరిపాలించే యంత్రాంగానికి చీమకుట్టినట్టుగా కూడా అవ్వడం లేదు. ఏమి సాధించారని, తెలంగాణలో ఎవరి బతుకులు మార్చారని శిలలపై అధినాయకుడు చిత్రాలు గీయించుకున్నాడో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది..

రాతి స్తంభాలపై చిత్రాలెందుకు…

తెలంగాణలో ఉన్న యాదాద్రి దేవాలయాన్ని ఇతర రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలకంటే దీటుగా తయారుచెయ్యాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ భారీ బడ్జెట్‌తో ఈ దేవాలయానికి కొత్త కొత్తగా సొగసులు అద్దుతున్న సంగతి అందరికి తెలిసిందే.. తాను చేసిన పనిని చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేయటమే కాకుండా, తమ ప్రభుత్వం చేస్తున్న కొన్ని ముఖ్యమైనా పథకాల సమాచారాన్ని కెసిఆర్‌ యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్న ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపైనా చెక్కించిన వైనం బయట పడి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.. ఈ రాతి స్తంభం మీద ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్రంతో పాటు, టిఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు ఐనా కారు చిత్రాన్ని కూడా చెక్కడం అందరిని అవాక్కు అయ్యేలా చేస్తుంది. ఈ రెండు చిత్రాలనే కాకుండా టిఆర్‌ఎస్‌ పథకాలైనా కెసిఆర్‌ కిట్‌, హరితహారం లాంటి పలు పథకాలు రాతి స్తంభాలపై చెక్కించినా తీరు ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. రాబోయే వెయ్యేళ్ల పాటు తన జ్ఞాపకాలు చరిత్రలో చిరస్థాయిగా ఉండాలనే ఆలోచనతోనే టిఆర్‌ఎస్‌ అధినేత యాదాద్రిలో ఆలయంలోని రాతిస్తంభాలపై చెక్కిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

రాజుల త్యాగాలను చిత్రీకరిస్తారు..

పురాతన ఆలయాల మీద నాటి చరిత్ర, అప్పటి సంస్కృతి, జీవన విధానాల్ని చెక్కడం తెలిసిందే. అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో యాదాద్రి గుడి మీద శిల్పాల్లో కెసిఆర్‌ బమ్మతో సహా ఆయన ఘనకీర్తిని తెలిపే రీతిలో చెక్కించడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుడిలోని కృష్ట శిలలపై నేటి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రజల జీవన విధానం, ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై చెక్కటంతో పాటు ప్రస్తుతం చెలామణిలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై సైల నాణాల్ని పొందుపరిచారు. వీటితో పాటు బతుకమ్మ లాంటి పండుగలు, నాగలి దున్నే రైతు లాంటి బమ్మలతో తెలంగాణ సంస్కృతిని పొందుపరుస్తూ రాళ్లమీద చెక్కుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది వీరులు, త్యాగధనులు వారి పేర్లు ఉద్యమంలో తనతో నడిచిన వారందరి వివరాల్ని ఎందుకు పొందుపర్చటం లేదని ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. ప్రజల అభివృద్దిని విస్మరిస్తూ, తనకు నచ్చినట్లు పరిపాలన కొనసాగిస్తున్న కెసిఆర్‌ తెలంగాణలో ఎవరూ ప్రశ్నించే వారు లేరని తన ఇష్టారాజ్యంగా పోతున్నారని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. కెసిఆర్‌ చిత్రీకరించిన బమ్మలపై ప్రజల నుంచి రాష్ట్రంలో ఏలాంటి తిరుగుబాటు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..

బతికున్న పోటోలు పెడుతే వంశానికే అరిష్టం..

దేవాలయాల్లో, శ్మశాన వాటికలలో బతికున్న వారి ఫోటోలు, శిలా విగ్రహాలు పెడుతే వారి వంశానికి అంత మంచిది కాదని ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు శ్రీనివాస శర్మ అభిప్రాయపడ్దారు. యాదాద్రి ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న దేవాలయ ప్రాంగణంలో కెసిఆర్‌ బమ్మ చెక్కినట్లుగా ప్రచారం జరుగుతోందని, అలా ఉంటే మాత్రం అది వారికి, వారి వంశానికే అరిష్టమనే వ్యాఖ్యానాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close