Featuredస్టేట్ న్యూస్

ఎర్ర జెండా లేని ఎన్నికలు

  • ఉమ్మడి నల్గొండ చరిత్రలో తొలిసారి
  • 45 మంది నామినేషన్ల తిరస్కరణ..!
  • సీపీఎం నామినేషన్‌ తిరస్కరణ
  • బరిలోకి దిగని సిపిఐ
  • ఉమ్మడి నల్గొండ చరిత్రలో తొలిసారి
  • 45 మంది నామినేషన్ల తిరస్కరణ..!

సూర్యాపేట:

ఉమ్మడి నల్గొండ చరిత్రలో ఓ కొత్తకోణం ఆవిష్కరణ. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఎక్కువగా ఉండే ఈ ఉప ఎన్నిక బరిలో నిలించేందుకు మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా నిబంధనలు పాటించని అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏకంగా 45 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎర్రజెండా లేకుండా ఎన్నికలు జరగటం ఇదే ప్రథమం. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి పేరాల శేఖర్‌ రావు నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. సిపిఐ ఎన్నికల్లో నిలబడలేదు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్నికల ముఖచిత్రంలో ఎర్రపార్టీ జెండా రెపరెపలు లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం విశేషం. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ధ్రువీకరణ పత్రాలు సరిగా లేనందున సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై సీపీఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి. హుజూర్‌నగర్‌లోని ఆర్వో కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థి పేరాల శేఖర్‌ రావు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.

45 మంది నామినేషన్ల తిరస్కరణ..!

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా 45 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు నామినేషన్‌ రిటర్నింగ్‌ అధికారి వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సీపీఎం అభ్యర్థి పేరాల శేఖర్‌ రావు నామినేషన్‌ కూడా ఉంది. ఈయనతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ఫామ్‌ 26లో పూర్తి వివరాలు లేనందున అధికారులు ఈ నామినేషన్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. చాలామంది అవగాహన లేక ఈ పొరపాటు చేసినట్టు సమాచారం. అయితే ఎంతమంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయనే అంశాన్ని మరికాసేపట్లో రిటర్నింగ్‌ అధికారి ప్రకటించనున్నారు. అయితే తమ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించడంపై సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి రిటర్నింగ్‌ అధికారి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నెల 21న జరగనున్న హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 24న జరగనుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close