ఎమ్మెల్యే సాక్షిగా…. జాతీయ జెండాకు అవమానం

0

వికారాబాద్ గ్రంథాలయం ముందు తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా మండిపడ్డ గ్రంధాలయ చైర్మన్ కొండల్ రెడ్డి.   వికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్. వరుసలో ప్రజా ప్రతినిధులు…. మరో వరుసలో జిల్లా అధికార యంత్రాంగం నిలబడి జాతీయ జెండా ” సలాం” చేస్తున్నారు జాతీయ జెండా తలకిందులుగా ఎగరడానికి గమనించిన వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అనుకోకుండా జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మళ్ళీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా గ్రంధాలయం ముందు ఆదివారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే వికారాబాద్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కొండల్ రెడ్డి తన కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేశారు ఆ జండా తలకిందులుగా ఎగరడం తో అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా కంగు తిన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ముఖ్యఅతిథిగా జెండా పండుగ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు ఆయన సాక్షిగానే వికారాబాద్ గ్రంథాలయం ముందు జాతీయ జెండా తలకిందులుగా వేలాడుతూ ఎగిరింది దీంతో జరిగిన పొరపాటును గమనించిన సిబ్బంది వెంటనే జండా ను కిందికి దింపి తిరిగి మళ్ళీ జండా ఎగరవేశారు వికారాబాద్ గ్రంథాలయ కార్యదర్శి జి హరీష్ శంకర్ జాతీయ జెండా ఏర్పాట్లను చేశారు తోటి సిబ్బంది సహకారంతో జండా ను ఏర్పాటు చేసిన  తోటి సిబ్బంది జాతీయ జెండాను తలకిందులుగా కట్టి గ్రంధాలయ చైర్మన్ కొండల్రెడ్డి తో జెండా ఎగురవేయడం వలన వారంతా నవ్వుల పాలు అయ్యారు ఈ విషయమై గ్రంధాలయ చైర్మన్ కొండల్ రెడ్డి సిబ్బందిపై మండిపడ్డారు జరిగిన పొరపాటుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వికారాబాద్ ఆర్ డి ఓ విశ్వనాథం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందంతో పాటు అనేకమంది ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారులు జిల్లా యంత్రాంగం కార్యక్రమానికి హాజరయ్యారు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా కఠినంగా వ్యవహరించడానికి గ్రంధాలయ చైర్మన్ కొండల్ రెడ్డి చర్యలు చేపట్టారు వికారాబాద్ గ్రంథాలయ కార్యదర్శి జి హరీష్ శంకర్ సరిగ్గా విధులకు హాజరు కాని కారణంగానే ఇలాంటి పొరపాటు జరిగిందని భావిస్తున్నారు కిందిస్థాయి నాలుగవ తరగతి ఉద్యోగులకు జెండా ఎరుపు కిందికి ఉండాల పైకి ఉండాలా అనే విషయమై తెలియని వారు గ్రంథాలయ సంస్థలో ఉద్యోగులుగా కొనసాగుతున్నారు వారికి జండా ఏర్పాటు కార్యక్రమాన్ని అప్పగిస్తే తెలియక జాతీయ జెండాను తలకిందులుగా దారానికి కట్టి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేయడానికి కారణమయ్యారు తప్పు ఎవరిదైనా నైతిక బాధ్యత ఉన్నత అధికారులకు ఉంటుందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని జండా కు హాజరైన కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here