Featuredజాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీపై ప్రజలను… మమతా తప్పుదోవ పట్టిస్తుంది

  • ఓటు బ్యాంకు రాజకీయాలకోసం అక్రమ వలసదారులను కాపాడుతున్నారు
  • సిటిజన్‌షిప్‌ బిల్లును త్వరలోనే తీసుకొస్తాం
  • కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా

కోల్‌కతా

ఎన్‌ఆర్‌సీపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర ¬మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. మంగళవారం టీఎంసీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తా బీజేపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్‌భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షా పాల్గొని బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలను గెలిపించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌సీపై మమతా రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీనీ అడ్డుకుంటానని దీదీ చెబుతోందని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ వలసదారులను దీదీ కాపాడుతున్నారని అన్నారు. భారత మాత గురించి మేము మాత్రమే ఆలోచిస్తామని అమిత్‌షా తెలిపారు. సిటిజన్‌షిప్‌ బిల్లును త్వరలోనే తీసుకొస్తామన్నారు. హిందువులు, సిక్కులు, జైనులు ఇలా ఎవరినీ బలవంతంగా వెళ్లగొట్టమని, ఎన్‌ఆర్‌సీ అందరికీ ఏకం చేస్తుంది ఎవరినీ విడగొట్టదన్నారు. కేవలం అక్రమంగా భారత్‌లో నివాసం ఉంటున్నవారిని మాత్రమే దేశం నుంచి వెళ్లగొడుతామని, బెంగాల్‌ ఇప్పటికే చాలా నాశనమైందన్న అమిత్‌షా.. మేం రాష్టాన్రికి పూర్వవైభవం తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. బెంగాల్‌లో శాంతి భద్రతల అమలు సరిగ్గా లేదని, త్వరలో బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిషా ధీమా వ్యక్తం చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close