Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

ఎన్ని కులకలం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :ఎట్టకేలకు అందరి ఎన్నికుల జాబితాలు సిద్దమయ్యాయి. అగ్రవర్ణాలకే అగ్రపీఠాలు వేశాయి. ”ఆ కులం జనాభా ఎంత ఉంది.? ఈ కులం జనాభా ఎంత ఉంది.? మరి ఆ జనాభా మేరకు రిజర్వేషన్లు లేకపోతే ఎలా..? మరి వాళ్లను ఎలా ఉద్దరించే కబుర్లు చెప్పాలనే కసరత్తులు చెస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ మరో అడుగు ముందుకు వేసి.. ముస్లిం రిజర్వేషన్లను అమాంతంగా పెంచేశారు. జనాభా మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పెంచారా..? ఆ ఒక్కటీ అడక్కండి.. ఎవరికెన్ని రిజర్వేషన్లు ఇవ్వాలో రాష్ట్రాలకే వదిలే యాలి. నడుమ కేంద్రం దొరతనం ఏంది..? అంటారు. సామాజికన్యాయంపై అంతగా మాట్లాడే కేసీఆర్‌ కీలకమైన చట్టసభల్లో అధికారం విషయంలో మాత్రం తూ నా బొడ్డు అనేశారు. తాను ప్రకటించిన 105 అభ్యర్థిత్వాల సరళి చూస్తే…ఆ కోణం నుంచి ఓసారి కేసీఆర్‌ ఏయే కులాల్ని నెత్తిన పెట్టుకున్నారు. ఎవరిని తేలికగా తీసుకున్నారు. చూద్దాం. స్థూలంగా పార్టీ సామాజిక న్యాయం సరళి అర్థమవుతుంది. కులాల వారీ విశ్లేషణలో తప్పులేదు. పార్టీ అవసరాలను బట్టి, స్థానిక సవిూకరణాలు, రాజకీయ చిక్కులు, అధినేత ఇష్టాయిష్టాలను బట్టి తరువాత ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. కేసీఆర్‌ ఆనవాయితీలకు, సంప్రదాయాలకు, రాజకీయ మర్యాదలకూ పెద్దగా కట్టుబడే నాయకుడేవిూ కాదు. గతంలో మహాకూటమిగా పోటీచేసినప్పుడు టీడీపీ పోటీచేయాల్సిన సీట్లలోనూ టీఆర్‌ఎస్‌ బీఫారాలు ఇచ్చారు. మరి టీఆర్‌ఎస్‌ మార్కు సామాజికన్యాయం కథ ఇది. మొత్తం 105 మందిలో దాదాపు 10శాతంతో 11 మంది వెలమలకు టికెట్లు. టిఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 సీట్లలో…. 35 టికెట్లు రెడ్లకు? ఒక వైశ్య, ఒక బ్రాహ్మణ, ఒక రాజపుత్‌, ఆరు కమ్మ (వలస వాదులు) కూడా కలిపితే? మొత్తం 55 టికెట్లు అగ్రవర్ణాలకే ఇచ్చారు సగానికి పైగా..! 56 శాతం దాకా జనాభా ఉంటుందని భావిస్తున్న బీసీలకు 20, బీసీల్లో ఓసీలుగా భావించబడే మున్నూరుకాపులకు అందులో 6 సీట్లు, ఆ మిగతా 14 సీట్లను కూడా సామాజికంగా, ఆర్థికంగా కొంత ఎదిగిన గౌడ, యాదవ, ముదిరాజ్‌, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులకే దక్కాయి. మరి బీసీల్లో అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు దక్కినవి శూన్యం. మిగతా సీట్ల విషయానికొస్తే మాదిగ 8, మాల 7 సీట్లు. నిజానికి తెలంగాణలో మాలలకన్నా మాదిగలు ఎక్కువ. ఆదివాసీ, లంబాడా సీట్లకొస్తే కోయ5, బంజారాలకు 7, ముస్లింలకు 2 సీట్లు, అన్నింటికన్నా ప్రధానంగా కేవలం నాలుగు మహిళల పేర్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కుల ఆత్మగౌరవ భవనాలు అంటూ చేసిన హడావుడి తక్కువేం కాదు.

పోట్ల కత్తి దూశారు: ‘సీట్ల లెక్కలు తేలే లోపే కాంగ్రెసులో కమ్మ వాటా ఎంతో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ రాజకీయ అనుభవం ఉన్న పోట్ల నాగేశ్వరరావు సామాజిక మాధ్యమాలలో మంగళవారం హల్‌ చల్‌ చేశారు. ఆయన ఏకంగా కాంగ్రెస్‌ తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలలో కమ్మ వారి భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఇది ఖమ్మం సీటుకే పరిమితం కాలేదు. కాకుండా పాలేరులో సీటు ఆశిస్తున్న బిసి నేత పతంగి వెంకటేశ్వర్లుదీ అదే కోణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014 ఎన్నికలలో…పార్టీల వారిగా గమనిస్తే

టిఆర్‌ఏస్‌ ఒక్క సీటు కూడ కమ్మ వారికి ఇవ్వలేదు. కాంగ్రెస్‌ రెండు సీట్లు ఇవ్వగా, తెలుగుదేశం ఏడు సీట్లు ఇచ్చింది. 2018లో కమ్మగా కారెక్కిన వారందరికి టిక్కెట్లు దక్కాయి. కాంగ్రెస్‌ అధిష్టానం పోట్ల నాగేశ్వరరావు ‘కులం పోటు’ బాగానే దిగిందని, టిఆర్‌ఎస్‌ ఇచ్చిన ఆరు సీట్ల గురించి కాంగ్రెస్‌ దిగాలు చెందుతున్నట్లు తెలిసింది.

కమ్యూనిస్టు పార్టీలలో ముఖ్య పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికే అనే విమర్శలు ఉన్నాయి. ఇక కులం కార్డుతో అన్ని పార్టీలలో 3284 మంది సీట్ల కోసం కులం కార్డులు వేసుకొని బయలుదేరారు. చెప్పడానికి సిగ్గుపడుతున్నాయి కానీ అన్ని పార్టీలలోనూ ‘కులం కార్డు’ ఉంది.

లౌకికవాదం ముసుగులో కుల రాజకీయాలు… జయ¬ కులం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close