ఎన్నికల సిబ్బంది ఆకలి పోరాటం

0

తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించే లేదంటూ తాండూరులోని ప్రాదేశిక కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగస్తులు ఆకలి పోరాటం చేశారు. భోజనం  విరామ సమయంలో భోజనం చేసేందుకు వచ్చిన ఉద్యోగస్తులకు భోజనం లేక పోవడంతో ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తాండూర్ ఎంపీడీవో లక్ష్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలను మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. భోజన వసతి కల్పించి అంతవరకు కౌటింగ్ విధులను నిర్వహించమని మొండికేయడంతో తాండూర్ ఆర్డిఓ వేణు మాధవ్ రావు ఎన్నికల సిబ్బందిని సముదాయించి నుంచి గంటలోపు భోజన ఏర్పాట్లు చేయడంతో ఉద్యోగస్తులు మళ్ళీ విధులకు హాజరయ్యారు. దీంతో రెండు గంటలపాటు కౌంటింగ్ కు అంతరాయం కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here