ఎంపీగా ప్రజల రుణం తీర్చుకుంటా : ఉత్తమ్

0

1999, 2004 లలో కోదాడ నుంచి 2009, 2014, 2018 లలో హుజుర్ నగర్ నుంచి ఎమ్యెల్యే గా..

2019 లో నల్గొండ ఎంపీ గా ఎన్నికయ్యారు. శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా

ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ గా 610 జిఓ హౌస్ మైంటెన్ కమిటీ చైర్మన్ గా పని చేసారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రి గా పనిచేశారు.

గత మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజుర్ నగర్ నియోజక వర్గాల ప్రజలు తనను ఎంతో ఆదరించారని వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా ఎంతో ప్రేమగా చూసుకున్నారని వారి అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు ఆయన తన హుజుర్ నగర్ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ లో కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనను కోదాడ, హుజుర్ నగర్ ప్రజలు ఎంతో ఆదరించారని, ఎంపీ గా కూడా గెలిపించి వారి అభిమానానికి చాటుకున్నారని అన్నారు. నల్గొండ ఎంపీగా గెలిచిన రాజీనామా అనివార్యం అయిందని అన్నారు.

ఎంపీ గా ఆ రెండు నియోజకవర్గాలతో పాటు మరో 5 నియోజక వర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందని ఇది అదృష్టంగా భవిస్తున్నానని అన్నారు.

నా ప్రాణం ఉన్నంత కాలం నాకు ప్రజాసేవ చేసుకుందుకు అవకాశం ఇచ్చిన నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి సేవకే అంకితం అవుతానని అన్నారు.

ఉత్తమ్ 20 ఏళ్ల పాటు రెండు నియోజక వర్గాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రదానంగా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి అభివృద్ధి, విద్యుత్ సబ్ స్టేషన్ల్జ్, రహదారులు, ఇంటర్ డిగ్రీ కళాశాలలు, ఆసుపత్రులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here