Featuredప్రాంతీయ వార్తలు

ఎంతకు తెగపడ్డార్రా..! ‘కబ్జా’ కథనానికి కట్టుబడి ఉన్నాం


◆ ‘ఆదాబ్’పై తప్పుడు కేసుపై వీడియో సాక్ష్యాలు
◆ ఇవిగో ఆధారాలు
◆ తప్పుడు డాక్యుమెంట్ల ‘సృష్టి’
◆ ‘ఆదాబ్’పై కుట్ర బట్టబయలు
◆ ఏ క్షణంలో… ‘మెరుపుదర్నా’కు జర్నలిస్టులు సిద్ధం

【ప్రభుత్వ పనితీరుపై ఆదాబ్ విశ్లేషణ కథనం-4】
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్,9440000009)


బంగారు తెలంగాణాలో ఏం జరుగుతోంది.అటవికరాజ్యం రాజ్యమేలుతోందా…? ‘ఆదాబ్ హైదరాబాద్’ కలలన్నీ ఈ దేశంలో సామాన్యుడికి జరిగే న్యాయం గురించి.. మాత్రమే. రూ.40 కోట్ల భూకబ్జా గురించి ఆధారాలతో సహా ఇచ్చాం. ఇప్పుడు సవివరంగా ఇస్తున్నాం.అలాంటి ‘ఆదాబ్’ ఆధారాలతో కథనాలు రాస్తుంటే… తప్పుడు కేసులు.. వేధింపులు… అయినా బెదిరేది లేదు. 2012నుంచి ఆదాబ్ ఎన్నో… ఎన్నెన్నో. దారుణాలను.. దాష్టికాలను చవి చూస్తుంది.. చూస్తామని తెలిసే… ఈ అయినా ‘నో కాంప్రమైజ్’.. ‘దమ్ము’అంటే చూడాలంటే ఓసారి ‘టచ్’ చేస్తే… హే’రంగా’ అంటూ సిబిఐ వైపు వెర్రి చూపులు చూడాల్సి వస్తుంది. చూపిస్తాం కూడా…పోలీసులు తెగించినట్లు… ‘ఆదాబ్’ తెగిస్తే…ఎలా ఉంటుందో ఇక ముందు రాబోయే భయంకర కథనాలను ఆధారాలతో అందిస్తుంది. ఆస్వాదించండి.

1983 సమాధిని తవ్వితే..:
నాటి ఆర్డీఓ జనార్దన్ రెడ్డి అక్టోబర్5, 1983న అవార్డ్ నెం. 6/83, ఫైల్ నెం. 829/81 ప్రకారం సర్వే నెంబర్ 207ను మూడు భాగాలుగా అనగా… (ఖాకీలకు అర్థం కావడం కోసం వివర్రంగా చెపుతున్నామ్) 207/1 లో మూడు ఎకరాలు, 207/2లో 19 గుంటలు, 207/3లో 18 గుంటల భూమిగా.. అధికారికంగా లిఖితపూర్వకంగా సబ్ డివిజన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంట్టే…అక్టోబర్ 5, 1983న సర్వే నెంబరు 207 అధికారికంగా అంతర్థానమైయింది. (గడ్డి తినే వారు అర్థం కానట్లు నటిస్తారు).సదరు ఆర్డీఓ సర్వే నెం. 207/1 లో 3 ఎకరాలు, 207/3లో18 గుంటల భూమిని పట్టాదారుల నుంచి రూ. 84,664లు ఇచ్చి భూసేకరణ చేశారు. ఇలా చేసిన భూమి స్థానిక ఎన్జీఓల ఇళ్ళ స్థలాలకు నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటైన ‘ఎన్జీఓల సంక్షేమ సంఘానికి కేటాయించారు. అంటే 207/2లో ఉన్న భూమి నాటి నుంచి నేటి వరకు పట్టాదారుల పేరుతోనే అధికారికంగా ఉంది.

1991లో ‘హరి హరా’ కుమ్ముడు ప్రారంభం:
1991 నుంచి1993 వరకు ఈ సంక్షేమ సంఘానికి మేకల హరిహరనాథుడు ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. (ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్నాడ్డు).
ఈ సమయంలోనే ఈ ‘దొంగాట’కు తెరలేచింది. అనధికారికంగా అక్రమ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ఇక్కడే దొర్లిన తప్పుకు నేడు ఈ కబ్జా కోరులకు వరంగా మారింది. ప్రభుత్వం అప్పగించిన సర్వే నెంబరు 207/1, 207/3 కాకుండా… తమకు హక్కు ‘లేని’ సర్వే నెంబరు 207 ద్వారా ఓ ప్లాట్ తన తండ్రి అయిన సత్యనారాయణకు (డాక్యుమెంట్ నెం. 814/1993) అమ్మటం మరో హాస్యాస్పదమైన మలుపు. డాక్యుమెంటు నెం. 807/1993, మాణిక్య శర్మ,
డాక్యుమెంటు నెం. 808/1993 బి.లక్ష్మీ, డాక్యుమెంటు నెం. 813/1993, కె.సత్యనారాయణ, డాక్యుమెంటు నెం. 809/1993 ఎం.శ్రీధర్ రెడ్డి తదితరులకు హక్కు లేని భూమిని సగర్వంగా అమ్మారు. ప్రధాన కార్యదర్శి మేకల హరి హరనాథ్ తండ్రి మేకల సత్యనారాయణ ద్వారా 2015లో విద్యాప్రకాశ్ రెడ్డి (డాక్యుమెంటు నెంబరు: 7920/2015)కి, వి.సౌజన్య (డాక్యుమెంటు నెం.7921/2015), టి.వరలక్ష్మి (డాక్యుమెంటు నెం.7922/2015), పి.సునీత రెడ్డి (డాక్యుమెంటు నెం.7962/2015), విద్యాప్రకాశ్ రెడ్డి (డాక్యుమెంటు నెం. 7990/2015), వి.సౌజన్య (డాక్యుమెంటు నెం. 7991/2015), పి.సునీత రెడ్డి ( డాక్యుమెంట్ నెం.7992/2015), జి.సుశీల (డాక్యుమెంట్ నెం.7919/2015)ల ద్వారా అమ్మారు. వీళ్ళెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కాక పోవడం ఒక విశేషం కాగా… పోలీసు ఫిర్యాదులో రజిత తన భర్త హరిబాబు మిత్రులుగా పేర్కొంటున్న మనోహర్ రెడ్డి ఈ భూ కుంభకోణంలో అనధికారి పాత్రధారి ఎలా అంటే హక్కులేని భూమి కొనుగోలు చేసిన విద్యాప్రకాశ్ రెడ్డి అల్లుడు కాగా., సునీత రెడ్డి స్వయాన ఇతగాడి కూతురు.

లోను పెట్టి… నమ్మకం కలిగించి..:
ఈ కుంభకోణంలో హరిహరనాథ్, మనోహర్ రెడ్డి అల్లుడు హెచ్. విద్యా ప్రకాష్ రెడ్డి, సౌజన్యతో పాటు సిండికేట్ బ్యాంకు మేనేజర్ పై రూ. 25లక్షలు మోసం కేసు నమోదైంది. ఈ పత్రాలు సరిగ్గా లేనంద వల్ల ఈ కేసు ఫైలైంది. ఈకేసులో మూడు లక్షలు చేతులు మారినట్లు తెలిసింది.

కమీషనర్ కళ్ళు తెరిచే అనుమతులు:
నవంబర్ 14, 2017 నుంచి బాధితులు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులకు ఈ ప్లాట్ల బాగోతంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి.

వినండిరా మూర్ఖుల్లారా..:
ఎమ్మర్వో లిఖితపూర్వకంగా మే10, 2019న ఫైల్.నెం.సి/1896/2019న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ‘1991 నుంచి 1993 వరకు సోసైటికీ సంబంధించిన వ్యక్తులు అమ్మిన పది ప్లాట్లు అనైతికమని చెప్పారు. అంటే పక్క వాడి సొమ్మును కాజేశారని స్పష్టం. అయ్యా కమీషనర్… ఫిర్యాదులు అందిన సంవత్సరం తరువాత ఈ దొంగ ప్లాట్లకు అనుమతులు ఇచ్చారని స్పష్టంగా తేలిపోతుంది. అయితే మున్సిపల్ కమిషనర్ తన అనుమతి మంజూరు పత్రంలో..”రజిత దరఖాస్తును అన్నీ పరిశీలించి నియమ నిబంధనల ప్రకారం అనుమతి’ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా…లెటర్ నెం. జి1/ఇ-299154/ఎంబీఎన్ఆర్/2019, తేది. 4-6-2019లో ఇదే కమీషనర్ ‘నాకేం సంబంధం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకే ఈ అనుమతులు ఇచ్చానని చెప్పారు. ఔరా..తల్లీ ఫిర్యాదులు ఇచ్చిన ఏడాది తరువాత అసలు సర్వే నెంబర్ లేని 207లో ఎలా అనుమతి ఇచ్చారో… అవినీతి నిరోధకశాఖకు బాధితులు వెళితే అందరి అసలు బతుకు బయటకు వస్తుంది. తథాస్తు. శ్రీఘ్రమేవ అభిష్ఠి ప్రాప్తి రస్తు.

అధికారుల సందర్శన…
అక్రమ కట్టడాల నిర్మాణాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, మునిసిపల్ కమిషనర్ సురేందర్ లు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మునిసిపల్ చైర్మన్ రాదా అమర్ తో కలసి శనివారం సందర్శించారు. అయితే ఈ నిర్మాణం అక్రమమా……? సక్రమమా..? అని మాత్రం అధికారికంగా ప్రకటన చేయక పోవడంపై పలువురు కాలనీ వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తప్పుడు ఫిర్యాదు:
‘ఆదాబ్ హైదరాబాద్’ 2012 నుంచి ఎన్నో ఆటుపోట్ల, కేసులు సంకెళ్ళు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దొడులను ఎదుర్కొంది. ఎదుర్కొంటున్నది. ఎదుర్కోబోతుంది. అన్నీ తెలిసి అన్యాయాలను ఎదుర్కొంటుంది ఆదాబ్.

(?). మహబూబ్ నగర్ ఫిర్యాదులో 27వ తారీఖున సంబంధిత పాత్రికేయులు మహబూబ్ నగర్ లో ఉన్నట్లు రాశారు.
ఆదాబ్ పంచ్: అది తప్పు. ఆయన హైదరాబాద్ నగరంలో ఉన్నారు. గత ఏడాదిగా మహబూబ్ నగర్ వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఉన్నట్లు సిసీ పుటేజులు ‘ఆదాబ్’ వద్ద భద్రంగా ఉన్నాయి. సామాన్యులు ఎన్నిసార్లు తిరిగితే కాని ఎఫ్ఐఆర్ లు… ఈ కబ్జా కోరులు (ఎమ్మార్వో నివేదిక ప్రకారం) రాగానే పోలీసులు హడావుడి చేయడం.

(?) ఒకవేళ ఆ పాత్రికేయులు వెళితే..?
ఆదాబ్ పంచ్: టోల్ గేటు వద్ద సిసి పుటేజీలో ఉంటారు.

(?) 27న సంఘటన జరిగితే..?
ఆదాబ్ పంచ్: మరి 29వ తారీఖు వరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వ లేదు

(?) 27న ఫిర్యాదుదారు, అక్కడే ఉన్నాని చెప్పే వారి సెల్ టవర్ల సిగ్నల్స్ ఎక్కడ.?

ఆదాబ్ పంచ్: పాత్రోకేయులు ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్నట్లు సిసి పుటేజి. సెల్ సిగ్నల్స్ కూడా హైదరాబాద్ లోనే… మరో ఫిర్యాదుదారు సెల్ సిగ్నల్స్ నాగర్ కర్నూల్ లో ఉన్నట్లు లభ్యం.

(?) మనోహర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి లు ఉన్నట్లు చెప్పడం

ఆదాబ్ పంచ్: ఈ ఇద్దరూ.. ఈ ప్లాట్ల కొనుగోలు భాగస్వాములు కావడం

ఆదాబ్ ప్రశ్నలు:ఎవరి వత్తిడితో ఎంత తీసుకొని ఈ ఫిర్యాదును స్వీకరించారు.? ఉన్నతస్థాయి దర్యాప్తుకు సిద్దమా..? ఆధారాలను లేని ఫిర్యాదుకు ఇచ్చే గుర్తింపు…100% ఆధారాలను ఆదాబ్ బట్టబయలు చేసింది. మరి ఈ కబ్జాదారులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.? మహబూబ్ నగర్ వచ్చిన పాత్రికేయులను గుర్తించగలరా..?

నా బిడ్డపై కేసా..? తాట తీస్తా.. -రేణుకాచౌదరి
జర్నలిస్టులందరూ తన బిడ్డలంటి వారేనని.. అందులో అనంచిన్ని నా కొడుకుతో సమానం. నిజాలు నిర్భయంగా రాసే నా బిడ్డపై కేసులా..? తాట తీస్తానని చెప్పారు.

ఎప్పుడైనా ధర్నాకు సిద్ధం. -జయప్రకాష్
నిజాలను నిర్భయంగా రాసే ‘ఆదాబ్ హైదరాబాద్’ జోలికి వస్తే యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర రాజకీయ పార్టీలతో కలసి ఏక్షణంలోనైనా ఎక్కడైనా ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
బహిరంగ చర్చకు సిద్దమా… దాసోజు శ్రావణ్
నిబద్దతో వచ్చే ‘ఆదాబ్’ కథనాలపై బహిరంగ చర్చకు తాను డాక్యుమెంట్లతో సిద్దమని, ప్రభుత్వం తరఫున ఎవరు వస్తారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.

పత్రికాస్వేచ్చకు గొడ్డలిపెట్టు -తమ్మినేని వీరభద్రం
ఆధారాలతో అవినీతిని వెలికితీసే ‘ఆదాబ్’పై ప్రభుత్వం వేధింపులకు దిగటం పత్రికాస్వేచ్చకు గొడ్డలిపెట్టు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులా- బాలరాజ్ నూనే (కేంద్ర, రాష్ట్ర భాజపా సమన్వయకర్త)
ఆధారాలతో ప్రభుత్వ పనితీరును, అవినీతిని ప్రైశ్నిస్తే కేసులా..? ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళతాను. ‘ఆదాబ్’ను కాపాడుకుంటాం.

మీం ఆదాబ్ వెంటే..మేళం శ్రీనివాస్ యాదవ్
ఆధారాలతో అద్భుతమైన కథనాలనుఅందించే ఆదాబ్ వెంటే ఉంటాం. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు వెనుకాడం.

దమ్ముంటే యూనివర్సిటీకి రండీ…మానవతారాయ్

‘ఆదాబ్ హైదరాబాద్’ 2012 నుంచి ఇప్పటి వరకు ఆధారాలతో ప్రచురించిన ఏ వార్తపై అయినా ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు యూనివర్సిటీ సంఘాల బాగోగులు చూసే మానవతారాయ్ ఛాలెంజ్ చేశారు.

నిజాలు నిర్భయంగా రాసే పత్రికపై వేధింపులా…? ౼కశ్యప్, చైర్మన్, చాణక్య టివి
నిప్పులొంటి నిజాలను ఆధారాలతో సహా ఆందించే ‘ఆదాబ్’ పత్రికపై వేధింపులా..? అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి సిద్దం

హైకోర్టుకు వెళతాం -రచనారెడ్డి
సమాజంలో అవినితిని ప్రశ్నించే ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికపై ప్రభుత్వం, మంత్రులు వేధింపులు మానుకోవాలని, లేదంటే జరుగుతున్న అక్రమాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close