Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఉత్తర భారతంలో భూకంపం..

ఢిల్లీలో కంపించిన భూమి..

  • పరుగులు తీసిన ప్రజలు
  • రిక్టార్‌ స్కేల్‌పై 6.3గా గుర్తింపు

ఉత్తర భారత దేశంలో భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల భూమి కంపించింది. ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా ప్రాంతాల్లో మంగళవారం భూ ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్‌-భారత సరిహద్దులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం 4:30 గంటలకు భూకంపం వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. రిక్టార్‌ స్కేల్‌పై 6.3గా భారత మెటరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది. 40కిలో విూటర్ల లోతు నుంచి ఈ ప్రకంపనలు మొదలైనట్లు రిపోర్ట్‌లో వెల్లడించింది. భారత్‌-పాక్‌ సరిహద్దు అంటే జమ్మూ కశ్మీర్‌లోనే ఎక్కువ ప్రాంతంలో ప్రభావం కనిపించింది. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు ఉత్తర భారతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగాయి. పాకిస్తాన్‌లోని లా¬ర్‌ వాయువ్య దిశ నుంచి ఈ ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంప తీవ్రతను తెలియజేసే సెంటర్‌ ఈ ప్రకంపనలను రిక్టార్‌ స్కేల్‌పై 6.3గా గుర్తించారు. భూకంపంకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇండో పాక్‌ సరిహద్దు కేంద్రంగా ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌లో భూకంపం బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే భారత్‌లో మాత్రం ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇళ్లల్లో వస్తువులు కదులుతుండటంతో గ్రహించిన ప్రజలు భూకంపం వస్తుందని భావించి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం నాటికి అమెరికాలోని ఓ ప్రాంతంలో భూ ప్రకంపనలు గుర్తించినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియాలజికల్‌ సర్వే తెలిపింది. ఈ ఘటన నమోదైన తర్వాత ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. శాన్‌ ఆంటోనియో వాయువ్య ప్రాంతంలో రాత్రి 11గంటల 23నిమిషాలకు 62కిలోవిూటర్ల మేర 10కిలో విూటర్ల లోతు నుంచి ప్రకంపనలు నమోదయ్యాయి. అమెరికాలో ఉన్న ప్రధాన ఎయిర్‌పోర్టు రాఫెల్‌ హెర్నాండేజ్‌ శాన్‌ ఆంటోనియో ప్రాంతానికి చెందినదే.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close