ప్రాంతీయ వార్తలు

ఉత్తమ విద్యకు నిలయాలుగా గురుకులాలు

నియోజకవర్గంలో త్వరలో హాస్టల్ హబ్ 
చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే  
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  
పటాన్ చెరు(ఆదాబ్ హైదరాబాద్): మైనార్టీ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ గురుకులాలను నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చదువుతో పాటు సంస్కారం ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే అవసరమని ఆయన చెప్పారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం పటాన్ చెరులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే  ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం గురుకులాలు నెలకొల్పి మెరుగైన విద్యతో పాటు అన్నివసతులు అందజేస్తుందని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు పౌష్టిక ఆహారం, మెరుగైన వసతులు, సన్నబియ్యంతో భోజనం, యూనిఫామ్ లాంటి వసతులను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి యేడాది లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను వెచ్చిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని వినియోగించుకొని విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో అన్ని హాస్టళ్ళు ఒకేచోట ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో త్వరలోనే హాస్టల్ హబ్ నిర్మించబోతున్నామన్నారు. ఇప్పటికే దీనికోసం పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. దీనికి తోడు మరో 10 ఎకరాలు కేటాయించి అన్ని హంగులతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాల్లో హాజరుశాతం, ప్రవేశాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి నియోజకవర్గం,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు.  

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close