Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

ఈఎస్‌ఐలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోండి

సెంట్రల్‌ విజిలెన్స్‌కు యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ ఫిర్యాదు

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): పేద ప్రజలకు సంబంధిం చిన వేలకోట్ల రూపాయలు పక్కదారి పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు పట్టించుకోవడం లేదని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ సెంట్రల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్‌లోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌ ప్రధాన కేంద్రంగా మందులు కొనుగోలులో సుమారు 446 కోట్ల కుంభకోణం జరిగింది. దీని ఆధ్వర్యంలో సుమారుగా పద్దెనిమిది లక్షల మంది కార్మికులు ఈఎస్‌ఐ కార్డును కలిగి ఉన్నారు. ఆనా రోగ్య సమస్య ఏర్పడినపుడు వారు, వారి కుటుంబీకులు ఇక్కడికి వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఈఎస్‌ఐలో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని చెపుతున్నా ప్రభుత్వం మాటలు ప్రకటన లకే పరిమితమవుతున్నాయి. పేద కార్మికులకు ప్రతిరోజు వైద్యాన్ని అందిస్తున్నామని మందులు కోనుగోలు చేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించి వందల కోట్ల రూపాయలను స్వాహా చేశారు.

ప్రభుత్వానికి రాష్ట్ర విజిలెన్స్‌ నివేదిక..

ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌ కేంద్రంలో అవినీతి జరిగిందని సమా చారం మేరకు తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధి కారులు అక్కడ జరిగినా అవినీతిపై పూర్తి నివేదికను తెలం గాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పిభ్రవరిలో అందజేశారు. నివేదిక ను అందజేసి దాదాపు ఎనిమిది నెలలు పూర్తవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు అందులో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరి పై చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. ఇందుతో జరిగినా వం దల కోట్ల స్కాంలో ప్రభుత్వంలోని వివిధ రంగాలకు చెందిన నాయకులు, అధికారులు హస్తం ఉందని తేలడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనుకాడుతోందని ఆరోపణలు వెలువడుతున్నాయి. అం త పెద్ద కుంభకోణంలో ఈఎమ్‌ఎస్‌ఐ కార్యాలయానికి చెందిన ఐదుగురి అధికారుల ప్రధాన పాత్ర ఉందని తెలిసినా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఐదుగురు అవి నీతి వల్ల పద్దెనిమిది లక్షలమంది కార్మికులు మందులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జ్వరాల బా రిన పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దానికి తోడు ఈ ఎస్‌ఐలో మందుల కొరత ఏర్పడడంతో కార్మికుల బాధలను పట్టి ంచుకునే వారే కరువయ్యారు. పక్కా సాక్ష్యాలతో నివేదిక ఇచ్చినా తమకు సంబంధంలేనట్లుగానేకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.

అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకొండి..

కొన్నె దేవేందర్‌. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ, కార్యదర్శి..

పద్దెనిమిది లక్షల మంది కార్మికుల జీవితాలతో ఐదుగురు అవినీతి అధికారులు అటాడుకున్నారు. ఈఎంఎస్‌ఐలో పేద ప్రజలకు సంబంధించిన మందుల కొనుగోళ్లలో సుమారుగా నాలుగు వందల ఆరవై కోట్ల కుంభకోణం జరిగింది. అక్కడ కుంభకోణం జరిగిందని రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చి నెలలు గడుస్తోంది. ఐనా ఇంతవరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోక పోవడానికి కారణాలు ఏంటో అర్థమే కావడం లేదు. అంత పెద్ద కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉందో తెలియడం లేదు. విజిలెన్స్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని మా యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ నుంచి సెంట్రల్‌ విజిలెన్స్‌ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశాం. వారు స్పందించిన యెడల కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేస్తాం.. పేద కార్మికులకు సంబంధించిన మందుల విషయాలలో కూడా ఇంతగా జరిగిందని రుజువులు ఉంటే ఏ ఒక్కరూ స్పందించక పోవడం దారుణమైనా విషయం. మా సంస్థ నుంచి ఈ విషయాన్ని కేంద్ర స్థాయిలో తీసుకెళ్తాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close