Featuredప్రాంతీయ వార్తలు

ఈఎస్ఐలో వందల కోట్లు కొల్లగొట్టిన’ దేవిక’.

                విజిలెన్స్ దాడులతో వెలుగుచూసిన కోట్లాది రూపాయల కుంభకోణం…… కాసులకు కక్కుర్తిపడి కార్మికులను  బలి ఇస్తున్న వైనం………. నిబంధనలను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా దోపిడి …….మందుల సరఫరా లో కుటుంబసభ్యులే కాంట్రాక్టర్ల అవతారం ……. విజిలెన్స్ దాడులు జరిగి రెండేళ్లవుతున్నా చర్యలు శూన్యం.

 వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు      వైద్యుడు  దైవంతో సమానం  అని  ప్రజలు నమ్ముతున్నారు. కానీ వైద్యుడే అక్రమాలకు పాల్పడితే…? వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని కోట్లు గడిస్తుంటే …? డబ్బు పిచ్చితో రోగులకు నాసిరకం మందులను  సరఫరా చేస్తుంటే…? ప్రస్తుతం  ఈ ఎస్ ఐ  ఆసుపత్రి విజిలెన్స్ దాడులలో భారీ కుంభకోణం  వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల మందుల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది. దీని వెనుక ప్రస్తుత రాష్ట్ర మంత్రి, ఓ మాజీ మంత్రి  ఉన్నట్లు సమాచారం. ఒకప్పటి లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డాక్టర్ తయారవ్వాలంటే  సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చవుతుంది. అయినా ప్రభుత్వం కేవలం నామమాత్రపు ఫీజులతో, లింగ భేదం లేకుండా డాక్టర్ వృత్తిని ఎంచుకున్న ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు  చేయూతను అందిస్తూ డాక్టర్లుగా తీర్చిదిద్దుతుంది. డాక్టర్లు తయారైన తర్వాత కొందరు తమ ఉనికిని, వృత్తి ధర్మం మరచి తల్లిలాంటి వైద్య వృత్తిని, ప్రభుత్వాన్ని, పేద ప్రజలను మోసం చేస్తూ కాసులకు కక్కుర్తిపడి కార్మికుల జీవితాలను పణంగా పెట్టి  రాత్రనకా పగలనకా కష్టపడే పేద ప్రజలు  జబ్బుపడితే  ఆ పేద కార్మికులను ఆదుకునే క్రమంలోనే  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు  మంచి ఆలోచనతో ఏర్పాటయిందే ఈఎస్ఐసి. కార్మికుల అందరి బాగోగులు చూడాల్సిన ఈఎస్ఐసి  డైరెక్టర్, పేద కార్మికుల రక్తమాంసాలను మార్చి డబ్బు సంపాదిస్తున్న వైనం  ఈ ఎస్ ఐ సి డైరెక్టర్ దేవికా రాణి బృందం రూపంలో కనిపిస్తుంది.
నగరంలో 77 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి  అంతేకాక 4 రకరకాల విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో  టై అప్  అయినారు. ఈఎస్ఐ  మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కార్మికులకు అందుబాటులో ఉన్నాయి.  వీటన్నిటి ద్వారా ప్రతిరోజు వెయ్యిల మంది వైద్యం తీసుకుంటారు. 
G.O 51ను( లేబర్  ఎంప్లాయి ట్రైనింగ్& ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్) తేదీ 9-4-2012  నాడు ఈ జీవోను విడుదల చేశారు. ఈ  జీవోను అడ్డుపెట్టుకొని  ఇష్టారీతిన  దోచుకుంటున్న వైనం, అత్యవసర మందులనీ  చెప్పి యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు  కేంద్ర ప్రభుత్వం ఏవి అత్యవసర మందులు,ఏవి  అత్యవసర మందులు కావో  పూర్తి వివరాలతో కూడిన  రేట్ కాంట్రాక్ట్ అని అంటారు. పూర్తి నియమ నిబంధనలు ఇందులో పొందుపరిచారు. ఈ రేట్ కాంట్రాక్ట్ పుస్తకాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి   ఈఎస్ ఐకి పంపిస్తారు. ఈ బుక్ లెట్ లో పొందుపరిచినవి  లేదా ఏ మందులు  రేట్ కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తాయో, ఏవి పరిధిలోకి రావో  కేంద్రం నిర్ణయిస్తుంది. పరిధిలోకి రాని మందులను లోకల్ గా(  అంటే స్థానికంగా) తీసుకోవచ్చు. ఈ విధానాన్ని నాన్ రేట్ కాంట్రాక్ట్ అంటారు. ఈ విధానం కూడా కేంద్ర ప్రభుత్వమే  పుస్తకంలో పొందుపరుస్తుంది. పైన ఉదహరించిన  రెండూ కాకుండా ఇతరేతర మందులను  ఎమర్జెన్సీ మందులు( అత్యవసర) అంటారు. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా ఈ అత్యవసర మందులను  మూడు నెలల ముందే( క్వార్టర్)  అన్ని డిస్పెన్సరీలో నుండి  వారికి  మందుల అవసరాన్ని తెలుసుకొని  జాయింట్ డైరెక్టర్ వెల్ఫేర్ అధ్యక్షతన ఏర్పాటైన డాక్టర్స్ తో కూడిన కమిటీ  డ్రగ్ ప్రోక్విర్మెంట్ నిర్వహిస్తోంది. జాయింట్ డైరెక్టర్ వెల్ఫేర్ అధ్యక్షతన ఏర్పాటయిన డాక్టర్ తో  కూడిన కమిటీ ఏవీ అత్యవసరమైన మందులు కమిటీ మొత్తం చర్చించి నిర్ణయిస్తుంది. కానీ జాయింట్ డైరెక్టర్ వెల్ఫేర్ తన విధులను నిర్వహించడానికి అవకాశం ఇవ్వకుండానే  అన్ని నిబంధనలను, అందరూ అధికారాలను కాలరాస్తూ అన్ని  నిర్వహిస్తూ
 మందులే కాదు ఏదైనా  అత్యవసర మందులను కొనాలంటే టెండర్లు పిలవాలి దానికి ముందు పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లు విడుదల చేయాలి. నోటిఫికేషన్ సంబంధించి పత్రాన్ని నోటీస్ బోర్డ్ లో  ఉంచాలి. అంతేకాక టెండర్లో పాల్గొనే కంపెనీలందరికీ మెయిల్స్ పంపించాలి.నోటిఫికేషన్ అన్ని పేపర్లలో ప్రచురించాలి. కానీ ఈ నిబంధనలు అందరికీ ఇవేమీ ఆమెకు వర్తించవు కేవలం ఫోన్ ద్వారానే తనకు నచ్చిన అత్యవసర  మందులను తెప్పించుకుంటుంది దేవికా రాణి. ఇక్కడ ప్రతీది అత్యవసరముగా  చిత్రీకరించిన కోట్లు దండుకున్నారు. స్థానిక కొనుగోళ్లపై జె.డి వెల్ఫేర్ కూడిన కమిటీ దీనిని ఆప్రూవ్ చేసి డైరెక్టర్ కు పంపించాలి.

విజిలెన్స్ దాడులతో వెలుగులోకి వచ్చిన భయంకరమైన నిజాలు… ఈఎస్ఐ లో వందల కోట్ల అక్రమ  కొనుగోళ్లను బయట పెట్టిన విజిలెన్స్ అధికారులు. 51 జీవోను తెరపైకి తెస్తున్న  డైరెక్టర్ దేవిక రాణి. విజిలెన్స్ దాడుల్లోబయటపడ్డ అక్రమాలు..  విస్తుపోయిన విజిలెన్స్స్ శాఖ. మందుల అక్రమ కొనుగోళ్లలో వందల కోట్లకు పైగా దోపిడీ కీలకంగా డైరెక్టర్ దేవిక రాణి తో పాటు 3 అధికారులు ఉన్నట్లుగా తేల్చిన విజిలెన్స్ అధికారులు. డాక్టర్  దేవికారాణి, ఎడి స్టోర్స్ వసంత, స్టోర్స్ ఇంచార్జ్ నాగలక్ష్మి, సూపర్డెంట్ వీరన్న లు కలిసి చేసిన అక్రమాలను బయటపెట్టిన విజిలెన్స్ అధికారులు. కమీషన్లకు తెగబడి ఒకే కుటుంబానికి చెందిన పలు  మెడికల్ ఏజెన్సీ లతో  మందులు కొనుగోలు చేసిన దేవికా రాణి. డిస్పెన్సరీ లా మందుల  అవసరాలు, టెండర్  పర్చేస్ కమిటీ గానీ, ఏలాంటి కమిటీలు లేకుండానే మందుల కొనుగోలు. ప్రభుత్వం నిర్ణయించిన ఆర్ సి (రేట్ కాంట్రాక్ట్) ఫర్మ్ తో  మందులు కొనకుండా ఎమర్జెన్సీ అని అధిక రేటు,ఎన్ ఆర్ సి( నాన్ రేట్ కాంట్రాక్ట్) లేదా  స్థానిక కొనుగోళ్లు  చేస్తే నిబంధనలను ఉల్లంఘించిన దేవికా రాణి. జాయింట్ డైరెక్టర్ వెల్ఫేర్ల  అధికారాలను  అన్ని దేవిక రాణి చెప్పు చేతుల్లోనే.ఎ డి  స్టోర్స్ అనిత, స్టోర్స్ ఇన్ చార్జ్   నాగలక్ష్మిలతో కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన బిల్లులు ఏర్పాటు చేసుకుంటూ  నిబంధనలు ఉల్లంఘించిన దేవికా రాణి. సీనియర్ ఫార్మసిస్ట్ అనిత ఉండగా, జూనియర్  ఫార్మసిస్ట్ అయినా నాగలక్ష్మిని స్టోర్స్ ఇన్చార్జిగా నియమించి అక్రమాలు చేస్తున్న దేవికారాణి. మెడికల్ ఏజెన్సీలకు, దేవికా రాణి  మధ్యవర్తిగా  ఆఫీసు సూపర్డెంట్  వీరన్న   వ్యవహరించడం మరియు  కమీషన్ వసూలు చేయడం. ఏలాంటి ఈ టెండర్ గాని, కొటేషన్స్ కానీ లేకుండానే అధిక ధరలకు మందులు కొనుగోలు చేస్తూ జీవో 51కు నిబంధనలకు నీళ్లువదిలి  విజిలెన్స్ రిపోర్టును బాధనామ్ చేస్తూ ,కార్మికుల మందులను  సరఫరా చేయడం లేదు. తనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉండడానికి జీవో 51ను తెర పైకి  తెస్తున్న  డైరెక్టర్. ఆర్ సి పై మందుల సప్లై  చేయని ఫార్ముల పై ఎలాంటి చర్యలు తీసుకొని డైరెక్టర్.చాలా వరకు నాసిరకం మందులను కొనుగోలు రోగులకు సరైన మందులు కొనకుండానే వదిలేశారు. థైరాయిడ్, నొప్పుల మందులు నొప్పులకు వాడే స్ప్రేలు, సైనస్ కు వాడే స్ప్రేలు కొనకుండానే కావాలని వదిలేశారు.రోగులకు ఉపయోగం లేని మందులను తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఎక్కువ ధర  చూపించి చెత్తబుట్టలో  పడేస్తున్నారు.Attachments area

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close