ప్రాంతీయ వార్తలు

ఇదేనా ! మనం కోరిన తెలంగాణ- ఎర్ర సత్యనారాయణ 


            వలస పాలకుల దోపిడి సంపదల కేంద్రీకరణ పాలనాధికార గుత్తాధిపత్యం కు వ్యతిరేకంగా, నియామకాలు, నిధులు సమాన పంపిణీకై పోరాడి, వేలాది మంది  బడుగులు ఆత్మార్పణ చేసి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. “ఇదేనా మనం కోరిన తెలంగాణ” అనే అంశంపై బీసీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ  దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు నియామకాలు జరగక అల్లాడిపోతుంటే, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల  భర్తీపై 5 సంవత్సరాల నుండి ఊసెత్తకుండా, ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్ తో ప్రభుత్వ సంబంధం లేని IT ఉద్యోగుల ప్రకటన చేయడం మరో మోసం అని ఆయన ప్రకటించారు. ప్రపంచీకరణలో భాగంగా మానవ వనరుల లభ్యత ప్రాతిపదికగా, అమెరికా విధానాల కారణంగా, ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవకాశాలు ఉన్న ఉద్యోగాలను కూడా తమ ఖాతాలోకి వేసుకునే దిగజారుడుతనానికి ప్రభుత్వం చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. అంతేగాక 5 సంవత్సరాల కాలయాపన చేసి ఉద్యోగాల భర్తీపై ఎటువంటి ప్రయత్నం చేయకుండా, తమ కోటరి మేధావి నందిని సిద్ధారెడ్డి ద్వారా కోర్టుల కారణంగా ఉద్యోగాలు ఇవ్వలేక పోయాము అని చెప్పే మోసపు ప్రయత్నాలు మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  సెలెక్ట్ అయిన TRT తదితర ఉద్యోగాలకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న ప్రవృత్తిని తక్షణమే మానుకోమని ఆయన డిమాండ్ చేశారు.

          తెలంగాణ వస్తే బడుగుల బతుకులు బాగుపడతాయని, ఆశించి ప్రాణాలు పోగొట్టుకుని, తెలంగాణ సాధించి పెట్టిన బడుగులకు రాజ్యాధికారం లో వాటా, ఆర్థిక అవకాశాలు, విద్య తదితర రంగాలలో అవకాశాలలో న్యాయం జరుగుతుందని ఆశిస్తే  ఈ ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్ర ఆరోపణ వ్యక్తం చేశారు. అధికారంలో సమాన వాటా ఇవ్వకుండా, వలస పాలకుల కాలంలో కూడా ఉన్న రిజర్వేషన్లు సైతం తగ్గించారు. ఉద్యమ కాలంలో ప్రముఖ పాత్ర వహించిన బడుగుల నాయకత్వాన్ని అణచివేసి, సొంత పార్టీ బీసీలను కూడా ఆధినాయకత్వం ఓడించి బడుగు విద్వేషాన్ని ప్రభలిస్తుంది. ఆలె నరేంద్ర, విజయరామారావు, విజయశాంతి, డీ.సీ మల్లయ్య, మధుసూదనా చారి, స్వామి గౌడ్ వరకు బీసీలను అణచివేయడమే తమ పాలసీ గా పెట్టుకున్నారు. ఈ పాలకులు తెలంగాణలో సాధించిన ప్రగతి ఇదాని ఆయన తెలియజేశారు.

          ప్రభుత్వం ఇకనైనా బడుగులకు స్వతంత్ర అధికారాన్ని బదిలీ చేయాలని, పక్కనున్న కొత్త ప్రభుత్వం నుండి విధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు పెంచాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి రాజ్యాంగ స్ఫూర్తిని నిలపాలని, బడుగుల వికాసానికి అవరోధమైన మద్యపానాన్ని నిషేధించాలని, సంపదలు, అవకాశాలు, వచింతులు, బాధితులు అవకాశా రహితులు మరియు సామాజిక అసమానతలకు గురైన వారికి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

          నయీం, నౌహీరా, ఎన్ కౌంటర్, ఆస్తుల జప్తు ద్వారా సమకూరిన ఆస్తులు అన్యాక్రాంతవుతున్నాయా ? ప్రభుత్వానికి జమ అవుతున్నాయా! తెలియజేసే ప్రయత్నం శూన్యం.

          ఇంటర్ ఆత్మహత్యలు, అనామిక ఆత్మహత్య ప్రభుత్వం ప్రజలకిచ్చే బహుమతా ! అని ప్రశ్నించారు. హాజీపూర్ అత్యాచారాలు నిత్యకృత్యాలయ్యయని ఆవేదన  వ్యక్తపరిచారు.

          ఈ సమావేశంలో c.రాజేందర్ ముదిరాజ్, వేల్పుల బిక్షపతి, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, పగిళ్ళ సతీష్, G.కృష్ణ యాదవ్, అనంతయ్య, నరేష్ గౌడ్, రాము తదితరులు ప్రసంగించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close