ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థ

0

తెలంగాణా రాష్ట్రం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థ. ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థ విద్యార్ధులు మొదటి పది ర్యాంకులలో ఎనిమిది ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) డైరెక్టర్స్ సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రావు, మల్లయ్య, కవిత రెడ్డి, చీఫ్ మెంటార్ ఎన్.ఎస్.రెడ్డి, ప్రిన్సిపల్ జాన్ రూఫస్, విద్యార్ధులని అభినందించారు. చీఫ్ మెంటార్ ఎన్.ఎస్. రెడ్డి గారు మాట్లాడుతూ “ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థ ఇంతటి ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. విధ్యర్డులకి, అధ్యాపకులకి గల నిష్పత్తి తక్కువగా ఉండడం వల్ల విద్యార్ధులు వెంటనే సందేహాలు తీర్చుకోవడానికి కుదిరింది. అలానే మా సంస్థలో విద్యార్ధులకి చదువు మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద అవగాహన కల్పించడంలో మేము సఫలీకృతులు అయ్యాము. మా విద్యార్ధులలో మొదటి నుంచి కూడా ఆత్మవిశ్వాసం, నమ్మకం, కష్టించి పని చేయడం లాంటి విషయాల పట్ల మానసిక నిపుణులతో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసి, సంస్థని, తల్లితండ్రులని గర్వపడేలా చేశారు. పిల్లల్ని చదువులోనే కాదు బయట ప్రపంచంలోని ఒడిదుడుకులను తట్టుకునే విధంగా తయారు చేయాలన్నదే మా లక్ష్యం.” అని ఆనందం వ్యక్తం చేశారు. ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థ ప్రిన్సిపల్ జాన్ రూఫస్ మాట్లాడుతూ “మేము, మా విద్యార్ధులు పెట్టిన కృషి వృధా పోలేదు అని ఈ ఫలితాలు నిరూపించాయి. ఇంటర్ రెండు సంవత్సరాలు విద్యార్ధి దశలో ఎంతో కీలకమైన సమయం. అలాంటి సమయంలో విద్యార్ధులు, తల్లితండ్రులు, చదువు చెప్పే గురువులు, విద్యా సంస్థలు ఎంతో ఒత్తిడికి గురి అవుతారు. ఇలాంటి సమయంలోనే అందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మా విద్యార్దుల సంపూర్ణ అభివృద్దే మా లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయడం వల్ల ఈ ఫలితం సాధించగలిగాము. ప్రతి సబ్జెక్టు లో ప్రతి విషయం కూడా ప్రతి విద్యార్ధికి అర్ధం అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాము. అలానే ప్రతి వారం నిర్వహించే పరీక్షలలో విద్యార్ధులు ఎలా రాస్తున్నారో చూసి, వారికి అర్ధం కాని విషయాలు మళ్ళీ కూడా అర్ధం అయ్యేలా చెప్పడంతో విద్యార్ధులు ఒత్తిడి లేకుండా తమ మీద తమకి నమ్మకంతో పరీక్షలకి వెళ్ళారు” అని తెలియచేశారు. ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థ పదవ తరగతి పాస్ అయిన విద్యార్ధులకి ఇంటర్ నుంచి ఐఏఎస్, ఐపిఎస్ కోచింగ్ ఇస్తారు. “ఈ కోచింగ్ వలన విద్యార్ధులకి ఇంటర్ సిలబస్ ఎంతో సులభతరం అయిపోతుంది. ఐఏఎస్, ఐపిఎస్ అవ్వాలి అనే కోరిక ఉండి, కష్టపడడానికి సిద్దం అయిన ప్రతి విద్యార్ధి కూడా సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి ఇగ్నైట్ ఐఏఎస్ సంస్థలో చేరమని, ఆ కోచింగ్ విద్యార్ధులకి ఎలా దోహదపడిందో మా ర్యాంక్ లే చూపించాయి” అని సంస్థ డైరెక్టర్ చింతం శ్రీనివాస్ రెడ్డి గారు తల్లితండ్రులకి తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here