ఆ నినాదం వినిపించకూడదు

0
  • హింసను వదిలిపెట్టాలి..
  • కాచిగూడ ప్రాంతంలో పాదయాత్ర
  • సాధురాం ఆసుపత్రి సేవలు అభినందనీయం
  • కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ ఆలోచన విధానంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. తుపాకులు, హింసను వదిలిపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తుపాకులు, హింస ద్వారా సాధించేదేవిూ ఉండదని స్పష్టం చేశారు. కాచిగూడ ప్రాంతంలోని రాజ్‌మొహల్లా, విఠల్‌వాడిలో కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లో పోలీసులపై రాళ్లురువ్వడంతో పాటు పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే నినాదం మన దేశంలో వినిపించకూడదని యువతకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. శని, ఆదివారాల్లో ప్రజలను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ.. స్థానిక సమస్యలను కిషన్‌రెడ్డి అడిగితెలుసుకున్నారు. డ్రైనేజి, రహదారుల సమస్యలను స్థానికులు కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. అంతకు ముందు విఠల్‌వాడిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.

సాధురాం ఆసుపత్రి సేవలు అభినందనీయం…

కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు సేవాభావంతో పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరు ఏరంగంలో ఉన్నా సమాజహితం కోసం పనిచేయాలని ఉద్భోదించారు. హైదరాబాద్‌ దోమలగూడలోని సాధురాం కంటి ఆసుపత్రి 45వ వార్షికోత్సవ వేడుకలకు కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మానవ సేవయే..మాధవ సేవ’ నినాదంతో ఈ ఆసుపత్రి పనిచేస్తోందన్నారు.సాధురాం ఆసుపత్రి ఒక విజన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ.. దక్షిణాదిలో కమర్షియల్‌ కాకుండా విజయవంతంగా నడుస్తున్న ఆసుపత్రి అని కొనియాడారు. తన వద్దకు వచ్చే వాళ్లు నోట్‌ పుస్తకాలు ఇస్తున్నారని.. వాటిని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ¬దా ముగిసిన అధ్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. విభజన హావిూల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని కిషన్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చెప్పారని తెలిపారు. అతి త్వరలోనే బీజేపీలోకి భారీ వలసలు కొనసాగుతాయని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.వచ్చే 2023లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టబోయేది బీజేపీయే అని కిషన్‌ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here