Featuredఅంతర్జాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఆరుగురు సర్పంచుల పై వే టు…?

నోడల్ అధికారులు. గ్రామ కార్యదర్శులకు 
30 రోజుల ప్రణాళిక నిర్లక్ష్యం పై నోటీసులు జారీప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా సర్పంచ్ ల భర్తల జోక్యంమండిపడ్డ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్

వి కారాబాద్ ఆదాబ్ హైదరాబాద్.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలులో అశ్రద్ధ నిర్లక్ష్యం వహించిన 18 మంది పై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ చర్యలు చేపట్టారు జిల్లా లోని బొంరాస్పేట్ ధరూర్ మండలం లోని ఆరు గ్రామపంచాయతీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ముచ్చెమటలు పట్టించారు గత రెండు రోజులుగా ఈ మండలాల్లో జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ ముందస్తు సమాచారం లేకుండా గ్రామపంచాయతీలో పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల ప్రణాళిక అమలు పై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించిన నోడల్ అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో అడుగడుగున నిర్లక్ష్యం అశ్రద్ద వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ జరిపిన తనిఖీల్లో తేలింది ఇందుకు బాధ్యులైన సర్పంచ్ ల పై నోడల్ అధికారులపై జూనియర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామ పంచాయతీ సెక్రెటరీ చర్యలు చేపట్టారు అందులో భాగంగా 18 మంది కి నోటీసులు జారీ చేశారు ప్రభుత్వం ఆదేశం ప్రకారం 30 అంశాలతో కూడిన ప్రణాళిక ఉంది అందులో గ్రామంలోని అన్ని వర్గాల వారిని సమన్వయ పరిచి గ్రామంలో ఆరోగ్యకరమైన పనులు చేపట్టాలని ఆదేశించింది ప్రతి గ్రామ పంచాయతీకి కమిటీని ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసారు జిల్లాలో కొన్ని చోట్ల మినహా 30 రోజుల ప్రణాళిక జోరుగా సాగుతుంది కొన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ మహిళా సర్పంచ్ భర్తలే ప్రభుత్వ కార్యక్రమాలు జోక్యం చేసుకోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి మహిళ గ్రామ సర్పంచులు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడం లేదని జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది దీంతో జిల్లా కలెక్టర్ మహిళా సర్పంచ్ భర్తలపై నోడల్ అధికారులపై గ్రామ సెక్రటరీ లపై మండిపడ్డారు గ్రామ సర్పంచ్ భర్తలు ఆధిపత్యం చల్లా ఇస్తున్నందున అధికారులకు సహకారం అందించడం లేదు దీంతో నోడల్ కమిటీ గ్రామాల్లో పారిశుధ్యం పనులు హరితహారం అంతర్గత రోడ్ల శుభ్రత పురాతనమైన భవనాల కూల్చివేత పాడుబడిన బావులు పూడ్చివేత వంటి కార్యక్రమాలు పూర్తి కాలేకపోయాయి జిల్లా కలెక్టర్ తనిఖీలో ఈ విషయం బయటపడడంతో బాధ్యులైన వారిపై కలెక్టర్ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఆరు మంది నోడల్ ఆఫీసర్ లు ఆరు మంది సర్పంచులు 6 మంది గ్రామ కార్యదర్శులకు నోటీసులు జారీ అయ్యాయి వారిలో బి జ్యోతి టీచర్ బురిడీ నోడల్ అధికారి ప్రసాద్ రావు తాసిల్దార్ బొంరాస్పేట్ నోడల్ అధికారి పాపిరెడ్డి ప్రధానోపాధ్యాయులు బొమ్మరసిపేట్ నోడల్ అధికారి తులసిరామ్ సీఏ మొన్న సోమవారం నోడల్ అధికారి మంజుల ఏ ఈ ఓ నర్సాపూర్ నోడల్ అధికారి మనోజ్ ఎఫ్ బి ఓ రుద్రవరం గ్రామపంచాయతీ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యం అశ్రద్ద కారణంగా నోటీసులు జెర్మియా వీరితోపాటు కే చందు నాయక్ గ్రామ సర్పంచ్ బుర్రి తాండ కె నారాయణ గ్రామ సర్పంచ్ మెట్ల కుంట కే జయమ్మ గ్రామ సర్పంచ్ బొమ్మరసిపేట్ పి అనూష గ్రామ సర్పంచ్ మున్నూరు సోమవారం కె చంద్రయ్య గ్రామ సర్పంచ్ నర్సాపూర్ కే చంద్రమ్మ గ్రామ సర్పంచ్ రుద్రారం వీరంతా ప్రభుత్వ అధికారులతో నోడల్ కమిటీతో సుమ సమన్వయ పరుచుకుని పనుల కారణంగా వీరికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం వీరిపై వేటు పడే అవకాశం ఉంది అభివృద్ధిలో భాగస్వాములు కానీ సర్పంచ్ ల పై సస్పెన్షన్ వేటు వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభివృద్ధిలో భాగస్వాములు కానీ సర్పంచులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖాన్ చర్యలు చేపట్టారు అంతేకాకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీలు జూనియర్ కార్యదర్శి లపై చర్యలు తీసుకుంటున్నారు వారిలో లో నరహరి బుర్ర తాండ సెక్రటరీ  యాదయ్య మెట్ల కుంట గ్రామ కార్యదర్శి ఇ కే గోపాల్ బొమ్మరసిపేట్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఎం రాజు మున్నూరు సోమవారం గ్రామ పంచాయతీ సెక్రటరీ వేమారెడ్డి ఇ నర్సాపూర్ గ్రామ సెక్రటరీ నర్సింలు రుద్రవరం గ్రామపంచాయతీ సెక్రెటరీ లు ఉన్నారు వీరంతా విధినిర్వహణలో నిర్లక్ష్య ధోరణి తో అన్నారు ప్రభుత్వం ఆశించిన ప్రణాళిక పూర్తి చేయడంలో విఫలమయ్యారు ఈ 18 మంది పై అనేక ఫిర్యాదులు అందడంతో ముందుగా షోకేస్ నోటీసులు జారీ చేసి వారి నుంచి సంజాయిషీ తీసుకున్న తర్వాత సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో మిగతా అధికారులు భయం చోటు చేసుకుంది ఇప్పటికే పని ఒత్తిడి కారణంగా అనేకమంది అధికారులు సెలవులపై వెళ్లారు ప్రభుత్వం 30 రోజుల అభివృద్ధి ప్రణాళిక కోసం అధికారుల సెలవులను రద్దు చేసి ఇ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవుపై వెళ్లిన విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వీరిపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టింది దీంతో జిల్లాలోని అధికారులతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close