ఆయేషా కేసులో అందరిచూపు ఆయనవైపు

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జీవితంలో తప్పులు చేయడం, పొరపాట్లు జరగడం సహజం. అయితే ఆ నిఖార్సయిన అధికారి హయంలో ఎన్నోగ్భ్భ్రాంతి కరమైన విషయాలు. ఆదాబ్‌ హైదరాబాద్‌ ఈకేసుకు సంబంధించిన కథనాలను సవివరంగా గతంలో అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అయేషా విూరా హత్య కేసుకు సంబందించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని తాజాగా సిట్‌ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.

ఖమ్మం కోర్టు రికార్డులూ…:

అయేషా హత్యకేసులో ప్రత్యేక విచారణ అధికారి, ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న ఏ.వి. రంగనాథ్‌ ఖమ్మంలో పనిచేశారు. ఆ సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోర్టు రికార్డులు ట్యాపరింగ్‌, పిర్యాదు కన్నా ముందే ఎఫ్‌ఐఆర్‌ లాంటి సంఘటనలు వెలుగుచూశాయి. న్యాయ నివేదిక ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వద్ద ఉంది.

ఈ నివేదిక గల్లంతు.?: అనేక ఆరోపణల నేపథ్యంలో రంగనాథ్‌ పై శాఖాపరమైన దర్యాప్తు జరిగింది. ఐజి నవీన్‌ చంద్‌ ఆధారాలతో కూడిన 94 పేజీల నివేదిక ప్రభుత్వానికి పంపారు. ఇప్పుడు ఆ నివేదిక కన పడటం లేదని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

అసలేం జరిగింది.: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో 2007 డిసెంబర్లో ఆయేషావిూరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడైన సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు దోషులను గుర్తించి శిక్షించాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తమ కుమార్తె హత్య కేసుపై దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు శంషాద్బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషా మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం ఆయేషావిూరా హత్య కేసుపై తాజాగా దర్యాప్తు జరపాలని సిట్ను

ఆదేశించింది.

సాక్ష్యాలు నాశనం చేసిందెవరు?: దర్యాప్తునకు సంబంధించి పురోగతి వివరాల్ని సిట్‌ శుక్రవారం హైకోర్టుకు సమర్పించింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. దిగువ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ సత్యంబాబు దాఖలు చేసిన అప్పీల్‌ 2017 మార్చి వరకు హైకోర్టులో పెండింగ్లో ఉందని, విజయవాడలోని దిగువ కోర్టులో 2014 అక్టోబర్‌ 7నే వస్తు సంబంధ సాక్ష్యాలు నాశనం చేశారని ధర్మాసనం గుర్తించింది. దీనివెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని ఆదేశించింది.

హైకోర్టు విస్మయం: దిగువ కోర్టులో వస్తు సంబంధ సాక్ష్యాధారాలను (మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌) నాశనం చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసు అప్పీల్‌ విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు నాశనం చేయడమేమిటని ప్రశ్నించింది. సాక్ష్యాల నాశనం వెనుక న్యాయశాఖ, కార్యనిర్వహణశాఖ, హైకోర్టు అధికారులు ఎవరున్నారో తేల్చాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్జీ)ని ఆదేశించింది.

న్యాయవ్యవస్థపై విశ్వాసం పోతుందని వాఖ్య:

ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు

విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించింది. ఆ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకే విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొంది. ఆయేషావిూరా హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నుంచి తొలగించి సీబీఐకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామనీ ప్రకటించింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం శుక్రవారం… స్పందన తెలియజేయాలని సీబీఐ అధికారిని సుమోటోగా ప్రతివాదుల జాబితాలో చేర్చి నోటీసులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here