Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆనాడు జరిగింది అబద్దమా…?

అటకెక్కిన ‘ఉ-నివేదిక’

  • రంగనాథ్‌ గౌడ్‌ పై కేసు కొట్టివేత
  • మహిళాసంఘాల ‘కోమా మౌనవ్రతం’
  • రజియాన తరఫున పోరాడేది ఎవరు..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రంగనాథ్‌ గౌడ్‌ ఓ చిరు ఉద్యోగి. వేసుకునేది ఖాకీ. రజియానతో ఛాటింగ్‌, ముచ్చట్లు.. వగైరా.. వగైరా.. ఖాకీ మాటున అంతా సమసిపోతుందని ముందుకు సాగాడు.కొంత విశ్రాంతి.. రజియాన బజారెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో విూడియా ¬రెత్తింది. ¬రెత్తించింది. గంటల తరబడి అభాగినితో రేటింగులు పెంచుకున్నాయ్‌. ఇదే అదనుగా.. టీవీల్లో హడావుడి చేసే మహిళా సంఘాలైతే… మరీనూ..! ఆ ఖాకీ తప్పు లేదని తీర్పు వచ్చింది. ఏం.. ఇప్పుడు మాట్లాడరేం..? ధైర్యం లేదా..? రక్తంలో వేడి తగ్గిందా..? టివీల్లో చర్చలు ఏవీ… ? కనీసం వార్తలు లేవేం..? ఇదేం దౌర్భాగ్యం. ఇప్పుడు ప్రసారాలు, చర్చలు చేయండి.. ? అసలేం జరిగిందో..? చెప్పండి..? ఓ అమ్మాయి జీవితంతో ఏళ్ళ తరబడి వ్యాపారం కోసం ఆడుకున్నారు. బాహ్య ప్రపంచానికి ఆ కూతురిని చూపారు. విూ ఆశయ బూతద్దంలో విూ మసకబారిన ముఖం విూరు చూసే ధైర్యం విూకు లేదు ఉండదు. ఎందుకంటే… అన్నీ తెలుసనే మసుగు వేసుకున్న విూకేం తెలియదు. అందుకే నవ రంధ్రాలు తెరుచుకొని పాఠాలు నేర్వండి. మారండి. ఈ కథనం చదవండి. ఇదే నేటి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రత్యేక కథనం.

(నోట్‌: ఈ కథనం ..న్యాయ వ్యవస్థకు, మహిళలకు వ్యతిరేకం కాదు, ఆ అవసరం ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు లేదు. ఉండదు. ఉండబోదు.)

రంగనాథ్‌ మోసం చేశారు:

రంగనాథ్‌ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, కేసు నడుస్తుండగా సాక్ష్యాలు మాయం చేశారని రజియా సుల్తానా అప్పట్లో సంచలన ఆరోపణలుచేశారు. పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారంలో రంగనాథ్‌ పై అప్పట్లో కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి.

సొంతూరు కదా…:

గుంటూరుజిల్లా, పొన్నూరులో ఎస్సైగా పని విధులు నిర్వర్తించిన సమయంలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, రంగనాథ్‌ గౌడ్‌ మోసం చేశారని రజియా సుల్తానా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసుల నుండి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులో మహిళా సంఘాల నేతలతో కలిసి ఆందోళన కూడా చేశారు. ఆ మహిళా నేతలు ఎక్కడ ఇప్పుడు (?).

ఖాకీపై వేటు..:

రజియాసుల్తానా ఫిర్యాదుతో ఉన్నతాధికారులు రంగనాథ్‌ గౌడ్‌ పైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఎస్సై రంగనాథ్‌ గౌడ్‌ ను నిఖార్సయిన పోలీస్‌ ఉన్నతాధికారి అనేక కోణాలు పరిశీలించి, పరిశోధించి శాఖాపరమైన విచారణ చేశారు..నాటి ఐజి సునీల్‌ కుమార్‌ అనేక కోణాలలో విచారించి.. పోలీసు బాధ్యతలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని రంగనాథ్‌ గుర్తించి అతనిని ఉద్యోగం నుండి తొలగిస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేశారు.

బాక్స్‌…

కేసు కొట్టివేత

గుంటూరుజిల్లా, పొన్నూరులో పదేళ్ల క్రితం ఎస్సైగా పనిచేసి, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రంగనాథ్గౌడ్‌ పై కేసును కొట్టివేస్తూ గుంటూరు 2వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎల్‌.శ్రీధర్‌ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. పొన్నూరులో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రంగనాథ్గౌడ్‌, అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. ఈ సంఘటన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కలిగించింది. ఉన్నతాధికారులు విచారణ చేసి రంగనాథ్గౌడ్‌ ను విధుల నుంచి తొలగించారు. ఆ తరువాత అతనిపై శాఖా పరమైన విచారణలో నేరం రుజువు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తరువాత అతనిపై నమోదైన పోలీసు కేసుపై తొలుత బాపట్ల కోర్టులో విచారణ జరిగింది. ఆ తరువాత గుంటూరు బదిలీ కాగా అతనిపై నేరం రుజువు కాలేదని నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయమూర్తి శ్రీధర్‌ తీర్పు చెప్పారు.

ప్రత్యేక బాక్స్‌… తప్పక వాడండి..

పరమాత్మ బేతాళప్రశ్న:

తప్పు చేశాడని ఉన్నతాధికారులు విచారణ చేసిన ఉద్యోగిని తొలగించిన ఉన్నతాధికారులు.. అదే నివేదికను న్యాయస్థానానికి అందజేశారా..? లేదా..? రజియా సుల్తానా ఇప్పుడు ఈ దిశలో పోరాటం సాగించాలి. మహిళా సంఘాలు ఇప్పుడు తోడుగా నిలవాలి. పోరాటాం చేయాలి. ‘ఆదాబ్‌’ న్యాయం కోసం రజియాసుల్తానా తో తోడుంటాం. వారి న్యాయ పోరాటంలో ముందుంటాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close