అ’రాజకీయులు’

0

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌) తెలంగాణ రాష్ట్రంలో రాజకీయపార్టీల నీడన అరాచకవాదులు నిక్షేపంలా బతికేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, పనులు చేసి పెడతామని, భూ వివాదాలు పరిష్కరిస్తామని.. అందుకు మాపార్టీ కూడా అండగా ఉంటుందని బొంకేస్తారు. వార్డు మెంబరుగా గెలవలేని అనామకులు లక్షల సంపాద నలకు మరిగారు. వీరిలో కొందరిపై దొవ్మిూ కేసులతో పాటు హత్యాయత్నాల కేసులు, చీటింగ్‌ కేసులు ఉండటం గమనార్హం. అధికార పార్టీ పంచన: చదువు అబ్బని కొందరు కండబలంతో మూర్ఖత్వానికి పరాకాష్ఠగా చెలరేగిపోతారు.స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేని పార్టీల పక్కన చేరతారు. అధికారంలో ఉన్న పార్టీ అయితే ఈ అధముల ఆగడాలకు అవధులుండవు. ఇళ్ళవిూదపడి బంగారం, ధనం దోచుకున్న సంఘటనలు ఉన్నాయి. కేసులదాకా వస్తే పోలీసులే మరోవైపు సర్దుబాటుకు ప్రయత్నిస్తారు. వీరి చేతిలో నిరుద్యోగ యువత చిక్కి ఒకొక్కరు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కేసుల రూపంలో ఉన్నవి జిల్లాకు రెండు నుంచి ఆరు కేసుల వరకు ఉన్నాయి. రంగు పడింది..: ఇటీవల వరకు అధికార పార్టీ పంచన ఉన్న వీరు, నెమ్మదిగా పక్క చూపులు చూస్తూ దిన కూలీలలాగా ప్రచారంలోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న అధికారపార్టీ అభ్యర్థి ఒక్కసారిగా కంగుతిన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వీరు తెరాస అధికారంలోకి రాగానే ఆ పార్టీ ప్రజాప్రతినిధిని బాగా వాడేసుకున్నారు. తాజాగా ‘మరో అభ్యర్థికి ‘నామా’లు పెట్టడానికి అనువుగా ఉన్న సిపిఐ పార్టీ జెండా భుజానికెత్తుకున్నారు. రౌడీషీట్‌ కు వెనుకంజ: అమాయకులపై కేసులు పెట్టడానికి ఉత్సాహంగా నా సామి’రంగ’ అంటూ ఉరకలు వేసే ఖాకీయులు వీరి విషయంలో విూనమేషాలు’ లెక్కిస్తారు. వీరి భూదందాలకు స్టేషన్‌ లే అడ్డాలు. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాలో బాధితుల వాంగ్మూలాలు తీసుకోకుండా చార్జిషీట్‌ వేసిన సంఘటనలు వెలుగుచూశాయి. బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే కానీ ఉన్నతాధికారులకు అసలు విషయం తెలియలేదు. అయినా బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. గులాబీ దొవ్మిూలు-ఎర్ర ధర్నాలు: సిపిఐపార్టీ, కాంగ్రెస్‌ పార్టీల నీడన ఉంటూ.. తెరాస ప్రతినిధులను కేసుల విషయంలో బాగా వాడేసుకున్నారు. ఇదో కుటుంబ అనుబంధంలా పెనవేసుకుపోతారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా దిగజారి పోతారు. దీనికి సిపిఐ పార్టీ అండగా నిలబడటం విడ్డూరం. (ఆడియో రికార్డులు భద్రంగా ఉన్నాయి) అపూర్వ స¬దరులు: పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా… ఎర్రజెండా నీడలో అరాచకాలు చేయడం వీరికి కేసులతో పెట్టిన విద్య. పగడాల స¬దరులంటే ఒకానొక స్థితిలో పోలీసులు భీతిల్లారంటే వీరి అరాచకాల స్థాయి ఏస్థాయిలో ఉందో చెప్పకనే చెపుతుంది. పోలీస్టేషన్‌ లో సివిల్‌ పంచాయతీలకు తావు లేదనే బోర్డులు స్టేషన్‌ లో కనిపిస్తాయి. అయితే ఖమ్మం 1, 2, 3 టౌన్‌, అర్బన్‌ పోలీస్టేషన్‌ పరిధిలో పగడాల మల్లేష్‌ అలియాస్‌ అలియాస్‌ మల్లిగాడుపై కేసులున్నాయి. అనుబంధంగా ఉన్న క్రైం నెంబర్లు: 117/2011 , 546/2013, 41/2014 ,( అర్బన్‌ పి.ఎస్‌), 94/2016, 141/2017, 145/2017,( 1 టౌన్‌ పి.ఎస్‌) 326/2017, 348/2017 ( అర్భన్‌ పి.ఎస్‌) ఇవి కాకుండా దొవ్మిూ కేసులు రెండు, కేసులదాకా రాని ఫిర్యాదులు కూడా ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. పగడాల మల్లేష్‌ అనే వ్యక్తి ఎలా వేధిస్తున్నారో వివరిస్తూ.. (రిట్‌ నెంబరు 6895/2018) కేసు దాఖలు చేశారు. తనను పగడాల మల్లేష్‌ చంపుతానని బెదిరించిన ఆడియో రికార్డులు కూడా జత పరిచి పిర్యాదు చేస్తే… చివరకు తనపైనే కేసు నమోదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గతంలో పగడాల మల్లేష్‌ లక్ష రూపాయలు డిమాండ్‌ చేశాడని, నలభైవేలు ఇచ్చిన ఆధారాలు, వీడియోలు ఉన్నాయని, పగడాల మల్లేష్‌ పై గతంలో ఇలాంటి విషయాలపై 5 కేసులున్నాయని ఆయన తెలిపారు. ఆధారాలతో ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయడానికి వస్తే అతనిపైనే కేసు నమోదు చేస్తానని ఖమ్మం మూడవ టౌన్‌ పోలీసులు చెప్పి….పగడాలకు బాధితునికి బలవంతంగా సంధి కుదిర్చారు. రాష్ట్రంలో..: ఇలా పార్టీలను అడ్డుగా పెట్టుకొని మొత్తం 891 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలలో ఇలాంటి కేసులు ఆదిలాబాద్‌ 42, నిజామాబాద్‌ 64, వరంగల్‌ 92, కరీంనగర్‌ 54, నల్గొండ 63, మహబూబ్‌ నగర్‌ 23, హైదరాబాద్‌ 398, ఖమ్మం 38, రంగారెడ్డి 69, మెదక్‌ 48 కేసులు అధికారికంగా నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here