అయాన్ బ్యాటరీల ఏర్పాటుకు సిద్ధం : జోషి

0

తెలంగాణ రాష్ట్రంలో గిగా స్కేల్ లి – అయాన్ బ్యాటరీల తయారి యూనిట్ ను ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టిన 5 గిగావాట్ల బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు అవసరమైన ల్యాండ్ బ్యాంక్, 200 ఎకరాలు ఎయిర్ పోర్టు మరియు అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్నాయని, అవసరమైన విద్యుత్, నీటి సదుపాయం కల్పిస్తామని, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సి.యస్ వివరించారు.
Transformative Mobility and Smart Storage పై నీతి ఆయోగ్ సిఈఓ అధ్యక్షతన వివిధ శాఖల సెక్రటరీలతో Inter-Ministerial Steering Committee తో కూడిన నేషనల్ మిషన్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని, అన్ని అర్హతలు కలిగి ఉన్నదని, టియస్ ఐపాస్ ద్వారా Single Window Clearance, అవసరమైన భూమి, వ్యవస్ధాపక సౌకర్యాలు, ancillary units కు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సి.యస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యవేత్తలకు అనుకూలమైన Electronic Manufacturing Policy ని దేశంలో అమలు చేస్తున్నామని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దేశంలో పెద్దదైన Electronic Manufacturing Cluster ఉందని తెలిపారు.Battery Manufacturing Unit ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం ముందుకు రావడం పట్ల నీతి ఆయోగ్ సిఈఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తూ ఈ విషయమై దేశంలో 5 రాష్ట్రాలను ప్లాంట్ల నిర్మాణం కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here