అభినందన్‌కు వీర్‌ చక్ర అవార్డు

0

వింగ్‌ కమాండర్‌, పాక్‌ గడ్డపై అడుగుపెట్టి సురక్షితంగా బయటకి వచ్చిన కమాండర్‌ అభినందన్‌కు వీర్‌ చక్రను ప్రదానం చేయనున్నారు. కొద్దిరోజులు ముందుగానే ప్రకటించిన ఈ పురస్కార్నాన్ని ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందజేయనున్నారు. 73వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా లక్షల మంది సైన్యానికి స్ఫూర్తినిచ్చేలా, అతని ధైర్య సాహసాలకు గౌరవసూచికంగా అవార్డు అందిస్తారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన భారత విమానాలను వెంబడిస్తున్న పాక్‌ యుద్ధవిమానాలు వచ్చాయి. వాటిని తరిమికొట్టేందుకు బయల్దేరిన అభినందన్‌ తప్పని పరిస్థితుల్లో పాక్‌ భూభాగంలో దిగాడు. పాక్‌ చేతిలో బందీగా చిక్కిన అభినందన్‌ను రెండు రోజుల తర్వాత పాక్‌ నుంచి బయటకు వచ్చాడు. దేశ రహస్యాలపై, సైన్యం ఉద్దేశ్యాలపై ఏ విషయం చెప్పకుండా మొక్కవోని ధైర్యంతో నిలిచి, స్వదేశానికి నేషనల్‌ హీరోగా వచ్చాడు. సైనికులకు వచ్చే గౌరవ పురస్కారాల్లో మొదటిది పరమ్‌ వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారమే వీర్‌ చక్ర. అభినందన్‌కు భారత అత్యున్నత అవార్డైన వీర చక్ర ఇవ్వాలని కోరుతూ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నామినేట్‌ చేసింది. తమిళనాడు సీఎం పళనిస్వామి సైతం అభినందన్‌ పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. తమిళనాడుకు చెందిన అభినందన్‌ 1983 జూన్‌ 21న భారతదేశంలోని ఎయిర్‌ మార్షల్‌ సింహకుట్టి వర్థమాన్‌కు జన్మించాడు. అభినందన్‌ తల్లి డాక్టర్‌, తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో యుద్ధ విమానాల పైలట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అభినందన్‌ కుటుంబం చెన్నైలో ఉంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here