Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

అక్రమ నిర్మాణాల అంతు చూస్తున్న పోచారం మున్సిపల్‌ కమీషనర్‌

నిబంధనలు తెలుసుకుని అమలు చేయాల్సిందిగా బోడుప్పల్‌, ఫీర్జాదిగూడ కమీషనర్‌కు వినతి

ఘట్కేసర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మంత్రి మల్లన్న అండతో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు అన్న శీర్షికతో ఆదాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో ప్రచురించిన కథనానికి స్పందిస్తూ పోచారం మున్సిపల్‌ కమీషనర్‌ మారుతి దివాకర్‌ ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి మౌనిక గురువారం ఇస్మాయిల్‌ ఖాన్‌ గూడెంలో కూల్చివేతలని ప్రారంభించారు. ఫోర్చరీ సంతకాలలో అక్రమ లే ఔట్లని సృష్టించి ఇంటి అనుమతులని సైతం సృష్టిస్తున్న వ్యవహారంపై పూర్తి ఆధారాలతో కథనాలని ప్రచురించిన విషయమై మున్సిపల్‌ ప్రజలు హర్షం వ్యక్తపరిచారు. ప్రభుత్వ స్థలాలని సైతం కబ్జా చేసి వందలాది ఇళ్లని నిర్మిస్తున్న బిల్డర్లపై క్రిమినల్‌ కేసులని నమోదు చేసి అమాయక ప్రజలని రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఫోర్జరీ సంతకాలతో లేఔట్‌ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలతో పాటు ఎల్‌వోసీ ద్వారా బ్యాంకు రుణాలని ఇప్పిస్తున్న కేటుగాళ్లపై తగు చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా పోచారం మున్సిపల్‌ కమీషనర్‌ మారుతి దివాకర్‌ శివారు మున్సిపాలిటీలలోని ఇతర మున్సిపల్‌ అధికారులకు ఆదర్శంగా నిలవాలని వారు కోరారు. బోడుప్పల్‌ మున్సిపాలిటీలో రెండు సంవత్సరాల క్రితమే ఏడువేల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని బోడుప్పల్‌మున్సిపల్‌ కమీషనర్‌ స్వయంగా ప్రకటించి, జిల్లా కలెక్టర్‌కు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తగు చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నార్ధకంగా మారింది. బోడుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలో చెరువులని సైతం చెరపట్టారని పోచమ్మ కుంట, రా చెరువు స్థలాల్లో నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని సర్వే నంబర్‌ 215లో సైతం ఫోర్జరీ సంతకాలలో లే ఔట్‌ ఇంటి అవినీతి పత్రాలు సృష్టించి రా చెరువును కబ్జా చేసి పారిశ్రామిక వాడలోఇండ్లని నిర్మిస్తున్నా చర్యలు తీసుకోకపోవడానికి బోడుప్పల్‌ మున్సిపల్‌ కమీషనర్‌ అవినీతికి పాల్పడటమే కారణమని ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోనూ వందలాది అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెరువు స్థలాలని కబ్జా చేసి యథేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు డబ్బులు లెక్కించుకోవడంలోనే బిజీగా ఉంటున్నారని విమర్శలున్నాయి. ఇప్పటికైనా పోచారం మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి దివాకర్‌ వద్దకు వెళ్లి నిబందనలని తెలుసుకుని వాటిని అమలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్లపై పూర్తి చర్యలు తీసుకుని తమ నిజాయితీని చాటుకోవాల్సిన అవసరముందని శివారు ప్రజలు పేర్కొన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close