అంతర్జాతీయ విత్తన సదస్సు సభ్యులతో సమీక్ష

0

హైదరాబాద్ లో జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు

సోమవారం రోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధ్యక్షతన, రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ లో జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు ఆర్గనైజింగ్ కమిటి సభ్యులతో, సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.కె.జోషి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రతినిధులు హైదరాబాద్ కు రానున్న దృష్ట్యా సెక్యురిటీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చెందడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, సదస్సులో ఇండియా, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు. FAO సహకారంతో సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదిలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిదులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక వర్క షాప్ ఉంటుందని, ఈ వర్క్ షాప్ కు తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొననున్నారని, విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదని అంతర్జాతీయ విత్తన సదస్సు నోడల్ ఆఫిసర్ డా. కేశవులు తెలిపారు. జూన్ 27 న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని తెలంగాణ నుంచి 1500 విత్తన రైతులు గుజరాత్ కర్ణాటక విత్తన రైతులు ఈ సమావేశానికి పాల్గొంటారని కమీషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here