Friday, March 29, 2024

సుమారు రూ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు..

తప్పక చదవండి
  • అక్రమంగా వెలుస్తున్న పలు వెంచర్లు..
  • చెరువులు, కుంటలను సైతం కొల్లగొడుతున్న వైనం..
  • కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా డోంట్ కేర్ అంటున్న కబ్జాకోరులు..
  • కబ్జాదారులకు భజన చేస్తున్న అధికారులు..
  • చేతివాటం చూపిస్తూ లక్షలు వెనుకేస్తున్న కొందరు అధికారులు..
  • అక్రమంగా కోట్లు గడిస్తున్న రియల్టర్లు..

లంచాల గడ్డి తినడానికి అలవాటుపడ్డ కొందరు ప్రభుత్వ అధికారులు.. కబ్జా దారులైన రియల్టర్లతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను అప్పనంగా వారికి అప్పగిస్తున్నారు.. చెరువులు, కుంటలను సైతం తమ అబ్బసొత్తు అన్నట్టుగా వారికి కట్టబెడుతున్నారు.. ఉన్నతాధికారుల నియంత్రణ కరువవడంతో ఇటు అవినీతి అధికారులు, అటు కబ్జాదారులు రెచ్చిపోతున్నారు.. ఇలాంటి ఘటనే ఇప్పుడు సదాశివపేటలో వెలుగు చూసింది.. వివరాలు చూద్దాం..

సదాశివపేట పట్టణంలో రోజు రోజుకూ అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా.. మమ్మల్ని ఎవరేం చేయలేరనే ధీమాతో.. అక్రమార్కులు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కొల్లగొడుతూ అక్రమంగా వెంచర్లు చేస్తున్నారు.. పట్టణంలోని 410 సర్వే నంబర్ లో గల దాదాపు నాలుగున్నర ఎకరాల భూమి సైతం కబ్జాకు గురైంది.. దీని విలువ దాదాపు రూ.. 40 కోట్ల వరకు ఉంటుంది.. కానీ కబ్జాకు గురౌతున్న ఈ ప్రభుత్వ భూమి వైపు అధికారులు ఏమాత్రం కన్నెత్తి చూడకుండా మొద్దునిద్ర పోతున్నారు.. ఈ వ్యవహారంలో అధికారుల వాటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. వారికి తగ్గట్లు ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అదే విధంగా ఊబ చెరువు, బొడ్డెమ్మ కుంట ఆత్మకూర్ ఎంకపల్లి ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిలో సైతం పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి.. ఎక్కడ శిఖం, లావణ్య పట్టా, పోరంబోకు భూములు కనిపించినా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలతో యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు.. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది.. మేమేం చేసిన ఎవరేం చేయలేరని ధీమాతో.. రియల్టర్లు ఇబ్బడి ముబ్బడిగా ముడుపులు వెదజల్లి ఆ భూముల్లో వెంచర్లు వేస్తున్నారు.. అయితే ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు.. ఎందుకంటే వారికి కావాల్సిన ముడుపులు వారికి అందుతున్నాయన్నది నిర్విదాంశం.. ఇకనైనా వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నో గ్రామాల్లో, పట్టణాల్లో ఇండ్లు, భూములు లేక ఎంతోమంది నిరుపేదలు అల్లాడుతున్నారు.. ఈ విధంగా కబ్జాలకు గురౌతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించి.. వారికి కేటాయించినట్లైతే.. అధికార ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు కదా..? తిరిగి అధికారం కట్టబెట్టి గౌరవిస్తారు కదా..? ఇంత చిన్న లాజిక్ అధికార ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎందుకు మిస్ అవుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. సదాశివపేట లో జరుగుతున్న కబ్జాల పర్వతాలపై మరిన్ని ఆధారాలతో మీ ముందుకు కథనాల్ని తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు