Friday, April 26, 2024

30 ఎకరాల దేవుడి మాన్యం మాయం..?

తప్పక చదవండి
  • సాక్షాత్తూ శ్రీరామచంద్ర స్వామికి రక్షణగా
    నిలిచిన హనుమంతుడి భూమికి రక్షణ కరువు..
  • దాదాపు 30 ఎకరాల విలువైన భూమికి ఎసరు..
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతినిత్యం వహిస్తున్న
    మహేశ్వరంలో వెలుగు చూసిన ఖబ్జా భాగోతం..
  • మంత్రి అనుచరులే కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న
    రాష్ట్రీయ వానర సేన..
  • ఫిర్యాదులు చేసినా పట్టించుకోని దేవాదాయ శాఖ..
  • పరిస్థితులు ఇలాగే ఉంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖ
    కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న రాష్ట్రీయ వానర సేన..

దైవం మానుష రూపేణా.. అంటారు.. ధర్మం నశించినప్పుడు దేవుడు మానవ రూపంలో జన్మించి సమాజంలో నెలకొన్న అధర్మాన్ని పాతరేసి ధర్మ స్థాపన చేస్తాడు అన్నది నానుడి.. నిజంగానే అలాంటి మహానుభావులను కూడా మనం చూశాం.. కానీ అధర్మానికి ఆయుస్సు ఎక్కువ అంటుంటారు.. అది నిజమే అనిపిస్తోంది ప్రస్తుత కాలంలో చోటుచేసుకుంటున్న అనేకానేక సంఘటనలు.. సమ సమాజంలో ప్రతి అణువు పాపాల మయమైపోతోంది.. పేరొందిన పుణ్యక్షేత్రాలు సైతం అపవిత్ర కార్యకలాపాలకు నెలవై పోతున్నాయి.. ఇది దేనికి సంకేతం..? కలియుగాంతం అని కొందరు అంటున్నారు.. కల్కిభగవానుడు జన్మించి పుణ్యకాలాన్ని, సత్య యుగాన్ని స్థాపించే తరుణం ఆసన్నమైంది అని చెబుతున్నారు.. కానీ కొందరు దుర్మార్గులు వీటన్నిటినీ పట్టించుకోకుండా తమ మానాన తాము పాప కర్మలు చేసుకుంటూనే పోతున్నారు.. కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగిపోతున్నారు.. వారికి సత్యం, ధర్మం, ఆత్మ విమర్శణ లాంటి పాదాలకు అర్ధం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.. దేవుడి మాన్యాలను అడ్డగోలుగా ఆక్రమిస్తున్నారు.. దీనికి హితోధికంగా సంబంధిత అధికారులు సైతం సహకరిస్తుండటం శోచనీయం.. పాలిత ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవహారాలపై చూసి చూడనట్టుండటం ఆందోళన కల్గించే విషయం.. మరి వారికి తెలియకుండా జరుగుతోందా..? తెలిసి కూడా తమకు అందవలసిన పైకం అందుతుండటంతో మిన్నకుండిపోతున్నారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. తాజాగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుమారు వందకోట్ల రూపాయల విలువగల భూమి అన్యాక్రాంతం అవడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి..

హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏమి జరుగుతోంది..? ఇబ్బడి ముబ్బడిగా భూకబ్జాలు జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు గానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వం గానీ, సంబంధిత మంత్రులు గానీ ఎందుకు చర్యలకు పూనుకోవడం లేదు..? కళ్ళు ముందు ఎన్నో సాక్ష్యాలను చూపెడుతున్నా.. సంబంధించిన కథనాలు ఆదాబ్ అనునిత్యం ప్రచురిస్తున్నా ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు..? దేవుడిని అపారంగా నమ్మే కేసీఆర్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం దేనికి సంకేతం..? దేవుడి మాన్యాలను కేవలం పరిరక్షించడమే ప్రభుత్వాల విధి.. అలా కాకుండా ఏవేవో కారణాలు చూపి ఇతర వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ కట్టబెట్టకూడదనేది నిబంధన.. ఈ విషయాన్ని కొన్ని రాష్ట్రాల హై కోర్టులతో బాటు, సుప్రీం కోర్టు సైతం ద్రువీకరించి ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా విదితమే.. మరి అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలను సైతం తోసిపుచ్చుతూ.. తమకు అనుగుణంగా చట్టాల సవరణ చేస్తూ.. అనుయాయులకు దేవుడి భూమిని కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం..? అన్న సందేహాలు మేధావులు సైతం వెలిబుచ్చుతున్నారు.. కోటాను కోట్ల దేవాదాయ శాఖ ఆదేనంలో ఉన్న భూములు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్యాక్రాంతం అయ్యాయి.. అవుతున్నాయి.. మరి ఈ భూముల పరిరక్షణ బాధ్యత మరిచిన ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు సమాధానం చెప్పగలరా..?

- Advertisement -

దేవాదాయ శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల ధనదాహం ఎలా సాగుతోంది..? అన్న విషయాలు ప్రభుత్వానికి తెలియటం లేదా..? లేక తెలిసీ తమవంతుగా వంత పడుతోందా..? అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.. రోజుకో చోట ఆలయ భూములు కైకర్యం అవుతున్న విషయం వివిధ మాధ్యమాల ద్వారా బహిర్గతం అవుతున్నా ప్రభుత్వం మౌనం వహించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి..? కనిపించని దేవుడు ఏమి చేస్తాడు..? అన్న నిర్లక్ష్యమా..? లేక తాము అధికారంలో ఉన్నాం కనుక ఏమి చేసినా చెల్లుతుంది.. అన్న అహంభావమా..? ఏది ఏమైనా దేవాలయ భూములను రక్షించాల్సిన ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యవైఖరి అవలంభించడం శోచనీయం.. ఇప్పటికైనా వారు కళ్ళుతెరుస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాలి.. తాజాగా వెలుగు చూసిన మరో భారీ అవినీతి భాగోతం వివరాలు ఒకసారి చూద్దాం..

రంగా రెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, గట్టుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన సర్వేనెంబర్ 65/2 లో సుమారు 30 ఎకరాల భూమి కలదు . ఈ భూమిని కొంతమంది కబ్జా చేసి లేఅవుట్లు వేసి అమ్ముకున్నారు. ఈ కబ్జా భాగోతం వెనుక స్థానిక మహేశ్వరం బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల హస్తం ఉన్నట్లు రాష్ట్రీయ వానరసేన ఆరోపిస్తోంది.. అధికార పార్టీ వారు ఈ కబ్జా వ్యవహారంలో ఉన్నందునే సంబంధిత అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఉదాసీనత వైఖరి ప్రదర్శిస్తున్నారని వారంటున్నారు.. అధికార ప్రభుత్వ పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అన్న చందాన అధికారులు వ్యవహరించడం శోచనీయం.. విలువైన దేవాలయ భూములను పరిరక్షించాల్సిన బాధ్యతలు మరచిన సంబంధిత అధికారులు క్షమార్హులు కాదని వారు అంటున్నారు.. తక్షణమే ఈ దేవాలయానికి సంబంధించిన భూమిని సర్వే చేసి, హద్దురాళ్ళు పాతి కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ 1 సెప్టెంబర్ 2023 నాడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ని కలిసి పూర్తి వివరాలు అందజేశారు రాష్ట్రీయ వానరసేన సభ్యులు.. దేవాదాయ ధర్మాదాయ శాఖపై తమకు ఉన్న నమ్మకాన్ని కాపాడాలని వారు వినతి పత్రం సమర్పించారు.. ఈ సమస్యపై 20 రోజుల గడువు లోపు సమస్య పరిష్కారం చేయని యెడల పెద్ద ఎత్తున దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాష్ట్రీయ వానర సేన హెచ్చరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు