Wednesday, April 24, 2024

25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు..

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదు
  • బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే
  • కాంగ్రెస్ ను జాకీపెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు.
  • ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు
  • ధరణివల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమే
  • కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొచ్చు
  • 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు
  • ప్రజల కోసం ఉద్యమిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు
  • కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి…
  • 5 నెలలు టైమివ్వండి…అరిగోస పెడుతున్న కేసీఆర్ ను సాగనంపుతాం
  • బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతు చూస్తాం
  • కుత్బుల్లాపూర్ బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు

‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే…. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నరు. బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు… ఆయనకు తెల్వదేమో… మాతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని చెప్పారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సభకు బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, మేడ్చల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, చేసిన అభివ్రుద్ధి, పేదలకు అందించిన సంక్షేమ పథకాలపై వాస్తవాలను తెలియజేసేందుకు మహజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నాం. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీల నేతలు కమీషన్లు దండుకునేందుకు, భూ దందాలకు నియోజకవర్గాల కార్యాలయాలను ఉపయోగిస్తున్నారు. బీజేపీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల తరపున పోరాటాలకు ఉపయోగిస్తున్నాం. మోదీ 9 ఏళ్ల పాలనలో 80 కోట్ల మంది మూడేళ్లుగా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. 12 కోట్ల మందికి స్వచ్ఛభారత్ కింద టాయిలెట్లు నిర్మించారు. 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. 3 కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించారు. 48 కోట్ల మందికి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ తో ఖాతాలు ప్రారంభించడంవల్ల రూ.25 లక్షల కోట్ల లావాదేవీలు జరిగి 2 లక్షల కోట్ల సేవింగ్స్ ఉన్నాయి. ఆరోజు ఖాతాలు ఓపెన్ చేస్తే మహిళలకు డిజిటల్ ఖాతాలను ఏట్లా మెయింటెనెన్స్ చేస్తారని కాంగ్రెస్ నేతలు హేళన చేశారు. ఈరోజు మహిళలు స్వయంగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా విజయవంతంగా లావాదేవీలు చేస్తున్నారు.

- Advertisement -

30 కోట్ల మందికి టాయిలెట్లు నిర్మించిన ఘనత మోదీదే. 220 కోట్ల మంది కోవిడ్ డోసులను ఉచితంగా అందించారు. మస్కట్ లో కోవిడ్ వ్యాక్సిన్ కు అయ్యే ఖర్చు 16 వేలు. కుల మతాలకు అతీతంగా దేశంలో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న ఘనత మోదీదే. ఇన్ని పనులు చేస్తున్న మోదీకి 9090902024 నంబర్ కు మిస్డ్ కాల్ చేసి మద్దతు ప్రకటించాలి. తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.లక్షా 10 వేల కోట్ల ఖర్చు చేశాం. 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం. రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేశాం. మరి కేసీఆర్ చేస్తుందేమిటి?…. ఎన్నికలకు ముందు జగద్గిరిగుట్టలో ఆర్టీసీ డిపో, ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. ఇక్కడ మంజూరైన 100 పడకల ఆసుపత్రిని టీఆర్ఎస్ వాళ్ల ఆసుపత్రులు నడవవని అల్వాలకు తరలించారు. కుత్బుల్లాపూర్ మినీ ఇండియా. ఒక్క వ్యక్తికైనా ఇక్కడ న్యాయం జరిగిందా? ఇవన్నీ ప్రశ్నిస్తుంటే… దారి మళ్లించేందుకు బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేటీఆర్ అంటున్నడు… వాళ్లకు తెల్వదేమో.. మాకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మీలెక్క మేం రాజకీయ వ్యభిచారం చేయదల్చుకోలేదు. బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే..

కాంగ్రెస్ ను జాకీ పెట్టి లేపినా లేవదు.. అసలు తెలంగాణలో కాంగ్రెస్ యాడ ఉంది? ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లైంత పార్టీ కాంగ్రెస్ దే. అటు ఇటు కానోడు సంసారం చేస్తాడా? డిపాజిట్లు కరువైన కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఎట్లా అయితది? ఢిల్లీలో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో ఒక్కటైనయ్. ఈ రెండు కలిసి రాష్ట్రపతి అభ్యర్ధి ముర్మును ఓడగట్టేందుకు కుట్ర చేశారు. ఒక్కసారి ఆలోచించండి.. ఏ పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కైందో అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ నుండి గెలిచిన నాయకులంతా పోస్ట్ పెయిడ్ నాయకులు.. గెలవకపోయినా బీఆర్ఎస్ లోకి వెళ్లే నేతలంతా ప్రీపెయిడ్ నేతలు. అట్లాంటి కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసే పార్టీ బీజేపీయే. నేను బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడతా… భాగ్యలక్ష్మీ వద్దకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వెళ్లేలా చేసిన ఘనత బీజేపీదే. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగట్టేందుకు బీజేపీ పోరాడుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాని 30 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నాడు. ధరణి మంచి పోర్టల్ అని కేసీఆర్ చెబుతున్నడు.. దానివల్లే రైతు బంధు వస్తోందని కేసీఆర్ అంటున్నడు.. 2018 నుండే రైతు బంధు ఇస్తున్నవ్ కదా.. ధరణి ఈ మధ్య తెచ్చిన పోర్టల్. దానికి దీనికి ఏం సంబంధం? ధరణితో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నరు. ధరణివల్ల లాఢపడ్డది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కేసీఆర్ కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి ఉపయోగపడుతోంది. ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులను, మహిళలను దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ రోజు నిమ్స్ లో 2 వేల పడకల కోసం శిలాఫలకం నిర్మించారు. కేసీఆర్ వేసిన శిలా ఫలకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రినే కట్టొచ్చు. కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్ దొబ్బడానికే శంకుస్థాపనలు. వేల కోట్లు సంపాదించి విదేశాల్లో దాచుకునేందుకే కేసీఆర్ యత్నిస్తున్నడు. తెలంగాణలో 5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఒక్కో తలపై 1.2 లక్షల అప్పు భారం మోపారు. దళిత బంధు అమలు చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను దారుణంగా మోసం చేస్తున్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇంతకాలం ఎందుకు అమలు చేయడం లేదు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వండి. కుత్బుల్లాపూర్ లో బీజేపీని గెలిపించండి. దేశంలో ఏర్పడేది నరేంద్రమోదీ ప్రభుత్వమే. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే 5 లక్షల కోట్ల అప్పు తీరుతుంది. ఫస్ట్ నాడే జీతాలొస్తాయి. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. కేసీఆర్ కు పొరపాటున అవకాశమిస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తడు. ఒక్కో వ్యక్తికి 2.4 లక్షల భారం మోపుతారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. పీజు రీయంబర్స్ మెంట్ నిధులు సక్రమంగా చెల్లిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను, పాఠశాలలను ఆధునీకరిస్తాం. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లిస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. బీజేపీకి 5 నెలల టైమివ్వండి. ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ సర్కార్ ను సాగనంపుతాం. అవినీతి పరులను కూకటి వేళ్లతో పెకిలించివేస్తాం. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే సంగతి చూస్తాం అని హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు