విషమంగా లాలూ ఆరోగ్యం?

విషమంగా లాలూ ఆరోగ్యం?

రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన్ని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమ్స్ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి వెంటనే ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ని విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. పశువుల దాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని జైలు నుంచి రిమ్స్క తరలించారు. చాలా రోజుల నుంచి అక్కడే. చికిత్స పొందుతున్నారు. అప్పుడు పరిస్థితి విషమంగా ఉన్నా... నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీనిపై రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమైంది. ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించనున్నారు. బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో లాలూ ప్రసాద్ యాదవు ఇటీవల శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు శిక్ష విధించింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. 1990 సంవత్సరంలో లాలూ సీఎంగా ఉన్నప్పుడు. డోరండా ట్రెజరీ నుంచి రూ.139.5 కోట్లు అక్రమంగా తీసుకున్నారని ఆయనపై కేసు నమోదైంది.

Tags :