Wednesday, April 24, 2024

నిరుద్యోగ యవతకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ..

తప్పక చదవండి
  • వరంగల్‌ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం
  • దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయం..
  • నిరుద్యోగులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి : సజ్జనార్..
    హైదరాబాద్ : నిరుద్యోగ యవతకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వరంగల్‌లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి, సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని ట్విట్టర్‌లో వెల్లడించారు. దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువు విధించినట్లు చెప్పారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివని సజ్జనార్ అన్నారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసిందని చెప్పారు. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోందన్నారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్‌ ములుగు రోడ్డులోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించవచ్చునని సజ్జనార్ వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు