కాబూల్‌ గురుద్వారాపై ఉగగ్రదాడి..

కాబూల్‌ గురుద్వారాపై ఉగగ్రదాడి..

సిక్కులు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు
ఇద్దరు సిక్కలు చనిపోయినట్లు సమాచారం
సిక్కులకు రక్షణ లేదన్న బీజేపీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ సిర్సా

కాబూల్‌, 19 జూన్ :

తాలిబన్ల పాలిత ఆప్ఘనిస్తాన్‌.. వరుస బాంబు దాడులతో అట్టుడుకుతోంది. శనివారం ఉదయం ఆప్ఘన్‌ రాజధాని కాబూల్‌లో పేలుళ్లు సంభవించాయి. కాబూల్‌లోని గురుద్వారా కర్తా పర్వ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లతో పక్కనే ఉన్న షాపులు కూడా దగ్ధమయ్యాయి. ఈ పేలుళల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ సిర్సా ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు. కాబూల్‌ని గురుద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు సూసైడ్‌ బాంబర్లు దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. అఫ్గాన్‌లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. గురుద్వారాపై దాడి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉగ్రదాడి పట్ల ఆందోళన చెందుతున్నామని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. ఈ బాంబు దాడులకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. వీడియోలో గురుద్వారా నుంచి పొగలు, మంటలను ఎగిసిపడుతున్నాయి. కాబూల్‌లో ఇవాళ ఓ గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఇప్పటి వరకు ఓ సిక్కు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ దాడికి పాల్పడిరది ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఖోర్షాన్‌ గ్రూపు అని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోరోషన్‌ ప్రావిన్సుకు చెందిన వాళ్లే కుర్షాన్‌ ఉగ్రవాదులు. ఆ దేశంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన మిలిటెంట్‌ సంస్థ ఇది. ఉదయం గురుద్వారా కర్తే పార్వాన్‌పై దాడి చేసింది ఈ గ్రూపే అని తేలింది. రెండు సార్లు బాంబు దాడి చేశారు. ఆ తర్వాత సిక్కులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరోషాన్‌ మిలిటెంట్‌ గ్రూపును 2015లో స్టార్ట్‌ చేశారు. ఇరాక్‌, సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆధిపత్యంలో ఉన్న సమయంలో ఈ గ్రూపును ప్రారంభించారు. ఈ గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్థాన్‌ తాలిబన్‌ సభ్యుల్ని రిక్రూట్‌ చేస్తారు. ఈ గ్రూపులో సుమారు 3వేల మంది మిలిటెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఖోరోషాన్‌ ఎక్కువగా రాజకీయవేత్తలు, భద్రతా దళాలు, మైనార్టీ వర్గాలు, అమ్మాయిలు, మెటర్నిటీ వార్డులను టార్గెట్‌ చేస్తుంటారు. ఇటీవల నుపుర్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ.. భారత్‌పై దాడి చేస్తామని కూడా ఈ గ్రూపు వార్నింగ్‌ ఇచ్చింది.

Tags :