ఉద్యోగ నిరీక్షణతో కళ్ళు కాయలు గాచిన వారికి దిక్సూచి..

- ఎంతగానో ఉపయోగ పడనున్న " చాఫ్టర్ వైస్ జనరల్ స్టడీస్
అండ్ జనరల్ ఎబిలిటీ " పుస్తకం..
- ఎనిమిదేళ్ల నిరీక్షణను నిజం చేసుకోండి..
- నిరుద్యోగులకు గైడ్ అందించిన అర్పణ పబ్లిషర్స్..
హైదరాబాద్, 05 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు కావస్తున్నా.. నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతున్నా.. తెరాసా ప్రభుత్వం మనసు కరగలేదు.. మొత్తానికి రాష్ట్రవ్యాప్త నిరసనల మూలంగానో.. ఎన్నికలు రాబోతున్నందువల్లనో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టింది.. దానిలో భాగంగానే నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది.. అయితే ఇన్ని సంవత్సరాలు నిరాశా, నిస్ప్రుహలతో నిలిచిపోయిన నిరుద్యోగుల మెదళ్ళు మొద్దుబారిపోయాయి.. ఇప్పుడు సడన్ గా పోటీ పరీక్షలు ఎదుర్కోవాలంటే కొంత కష్టతరమే అని చెప్పవచ్చు.. ఈ పరిస్థితుల్లో వారికి ఎంతగానో ఉపయోగపడే ' చాఫ్టర్ వైస్ జనరల్ స్టడీస్ ' బుక్ ని అర్పణ పబ్లికేషన్స్ వారు అందించారు..
కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న 80,039 ఉద్యోగాల భర్తీలో భాగంగా టి.ఎస్.పీ.ఎస్.సి.. వారు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న క్రమంలో కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభిస్తున్న విద్యార్ధులతో పాటు ఇప్పటికే ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులతో సహా ఉద్యోగం సాధించాలంటే టి.ఎస్.పీ.ఎస్.సి. వారు గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ల పరిశీలన తప్పనిసరి. ఎందుకంటే ప్రిపరేషన్ ప్రారంభిస్తున్న వారు గతంలో వచ్చిన ప్రశ్నల యొక్క క్లిష్టత స్థాయి, ఏ ఛాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఏచాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనే అంశాలని బట్టి వారి ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవలసి ఉంటుంది. ఈ విధమైన అనేక సంక్లిష్ట విషయాలను సరళతరం చేసేందుకు "అర్పణ పబ్లిషర్స్" వారు ప్రచురించిన "చాప్టర్ వైస్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ " అనే పుస్తకం మీ విజయన్ని సులభతరం చేస్తుంది. ఇందులో ఇప్పటివరకు టి.ఎస్.పీ.ఎస్.సి. వారు నిర్వహించిన అన్ని ఎగ్జామ్స్ లోని ప్రశ్నలను చాప్టర్ వైస్ విడదీసి విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకునే రీతిలో పొందు పర్చటం జరిగింది. ఈ పుస్తకాన్ని గతంలో టి.ఎస్.పీ.ఎస్.సి. వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఉద్యోగానికి ఎంపికైన వారు తమ మెళకువలను జోడించి రూపొందించటం జరిగింది. కావున ఈ పుస్తకం మీరు సబ్జెక్టులవారీగా ప్రశ్నలను సునాయాసంగా అధ్యయనం చేయటానికి తద్వారా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సహకరిస్తుందని పబ్లిషర్స్ తెలియజేస్తున్నారు..
బుక్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ :
1. దుర్గా డిస్ట్రిబ్యూటర్స్ - 9849038377..
2. దుర్గ బుక్ స్టాల్ - 9032434125..
3. వికాస్ బుక్ స్టాల్ - 6300126600..
4. అర్పణ పబ్లిషర్స్ - 6304891918..
5. శ్రీ రాఖీ బుక్ సెంటర్ - 9908224421..
లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో బుక్ షాపులో దొరుకుతుంది..