తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..

తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..


మరో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరణ

న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :

తెలంగాణ నుంచి అదనంగగా మరో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్‌ బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.వరి ధాన్యం, ఉప్పుడు బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వాలుగా పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మరో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్ట్గిªడ్‌ పారా బాయిల్డ్‌ బియ్యం సేకరించాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన రూపంలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. బియ్యం భారత ఆహార సంస్థ (ఈఅఎ) కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే ఈ అవకాశం కల్పించినట్లు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొన్నది.

Tags :