వేరీజ్ హోం మినిష్టర్..?

వేరీజ్ హోం మినిష్టర్..?

- రాష్ట్రానికి హోం మంత్రి ఉన్నట్టా ? లేనట్టా?
- నడిరోడ్డులో దళిత యువకుడిని హత్య చేస్తే సీఎం స్పందించలే?
- మానవత్వం లేని మూర్ఖుడు సీఎం కేసీఆర్.. 
- నిందితులను కాపాడేందుకే అరెస్టు చేశారు..  
- వికారాబాద్, మర్పల్లి లో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన 
  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

వికారాబాద్ 16 మే (ఆదాబ్ హైదరాబాద్):

హైదరాబాదులోని, సరూర్ నగర్ లో జరిగిన దళిత యువకుడు నాగరాజు హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం అమ్మాయిని వివాహం చేసు కోవడమే ఈ హత్యకు గల ప్రధాన కారణం కాగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బుధవారం మృతుడు నాగరాజు నివాసమైన వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండల కేంద్రానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, స్థానిక నాయకులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నిందితులకు కఠిన శిక్ష పడేవరకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని భరోసా కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షిస్తే ఉందని అనుకున్నాం..  కానీ అది జరగలేదని కేవలం నిందితులను కాపాడేందుకు అరెస్టు చేశారని అన్నారు. ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడని దళిత యువకుడైన నాగరాజును నడిరోడ్డులో హత్య చేస్తే ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో తాము జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అందుకు వెంటనే స్పందించి బాధిత కుటుంబం పట్ల జాతీయ ఎస్సీ కమిషన్ పలు ఆదేశాలలో భాగంగా మృతుని కుటుంబానికి 8 లక్షల 50 వేల ఆర్థిక సాయం, 3 ఎకరాల భూమి, ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇకపోతే మహిళా మంత్రి ఇప్పటివరకు రాకపోవడం దారుణమని, బిజెపి నాయకులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాష, తదితర నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాక సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో తూతూమంత్రంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి వెళ్లారే తప్ప నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం దృష్టికి తీసుకెల్లే ప్రయత్నం కూడా చేయకపోవడం దౌర్భాగ్యమని ఆరోపించారు. హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి ని పెళ్లి చేసుకుంటే చంపేస్తారు, మరి అదే అబ్బాయిలు హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ లో పడేసేందుకు బయటి దేశాల నుండి డబ్బులు పంపిస్తున్నారని, ఒక్కో కులం అమ్మాయికి ఒక్కోరకమైన అమౌంట్ ప్యాకేజి అందుతుందని..  ఇదంతా పోలీసులకు, ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని అయినా పట్టించుకోవడం చేతకాదని ఆరోపించారు. ఇక పోతే రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్న లేనట్టేనని స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. హోమ్ మినిస్టర్ ఉన్నాడు అన్న విషయం కానిస్టేబుల్ కు కూడా తెలియక పోవడం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు. హోమ్ మినిస్టర్ మాట్లాడడు, డిజిపి మాట్లాడడు, సీఎం అసలే మాట్లాడడు, మహిళా మంత్రి జాడే లేదు..  అంటూ  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంకు గుర్తింపు తెచ్చి పెట్టేలా ఉంటేనే స్పందిస్తారని లేదంటే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతాడని దుయ్యబట్టారు. పెద్దోళ్ల ఇంట్లో ఎవరైనా చనిపోతే మంచి వస్త్రాలు ధరించి హాజర్ అవుతాడు అని ఎద్దేవా చేశారు. నాగరాజు హత్య పట్ల సీఎం స్పందించకపోవడానికి అడ్డంకులు ఏంటి అని ప్రశ్నించారు. ఎంఐఎం గుండాలను పెంచి పోషిస్తున్నది కెసిఆర్ అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఎంఐఎం పార్టీ అంటే సీఎం గజగజ వణకడం ఏమిటని అన్నారు. నిందితుడిని ఉరి తీయకపోతే బయటికి వచ్చాక వాడి చెల్లెను, నాగరాజు కుటుంబ సభ్యులను చంపేయడు గ్యారెంటీ ఏమిటని, ఒక్క సారి రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించాలని, ఇప్పటికైనా  మించిపోయింది లేదని..  తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ స్పందించి నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక బిజెపి నాయకులు, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :