ప్రతిభను వెలికి తీసేందుకు అవార్డ్స్ స్ఫూర్తినిస్తాయి..

ప్రతిభను వెలికి తీసేందుకు అవార్డ్స్ స్ఫూర్తినిస్తాయి..

ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించేందుకు అవార్డులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోషల్ మీడి యాలో ప్రజా అభిమానం పొందిన వ్యక్తు లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇన్ఫ్రాయూ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇన్ఫూయెన్స్ 2022 అవార్డ్స్ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పలువురికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సైతం వీడియోలు చేసుకునేవారికి తగిన గుర్తింపు రావాలనే ఉద్దే శంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. మీడియా ప్రధాన మీడియాతో సమానంగా సమస్యలను వెలికి తీయడం లో సోషల్ మీడియా సైతం తగిన కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, కథానాయ కురాలు హెబ్బా పటేల్, పూర్ణ, బిగ్ బాస్ సన్నీ, హైపర్ ఆది, హరిప్రియ, నిర్మాతలు అంబికా కృష్ణ, దామోదర ప్రసాద్, ఎం ఎల్ సి రవీందర్ రావు, శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :