బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..


సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు మోస్ట్‌ అవెటెడ్‌ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్నింగ్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మహేశ్‌ నుంచి వచ్చిన సినిమా ఇది. తెరపై సూపర్‌ స్టార్‌ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. మహేశ్‌ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది. 

సర్కారు వారి పాట ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ వివరాలు : నైజాం - రూ. 12.24 కోట్లు.. సీడెడ్ - రూ. 4.7 కోట్లు.. ఈస్ట్ - రూ. 3.25 కోట్లు.. వెస్ట్ - రూ. 2.74 కోట్లు.. ఉత్త‌రాంధ్ర - రూ. 3.73 కోట్లు.. గుంటూరు- రూ. 5.83 కోట్లు.. కృష్ణా - రూ. 2.58 కోట్లు.. నెల్లూరు - రూ. 1.56 కోట్లు.. మొత్తం రూ.36.69 కోట్లు 

Tags :