కథల పోటీలకు భారీ స్పందన..

కథల పోటీలకు భారీ స్పందన..

హైదరాబాద్‌, 06 మార్చి : రాష్ట్రంలోని హైస్కూలు విద్యార్థులకు నిర్వహించిన కథల పోటీలకు భారీ స్పందన వచ్చింది. ‘మన ఊరు-మన చెట్లు’ అనే అంశంపై శుక్రవారం పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నట్టు సమాచారం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంత మంది పిల్లలు ఒకేసారి కథలు రచించడం చరిత్రలో ఇదే తొలిసారని తెలంగాణ సాహిత్య అకాడ మీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. 

Tags :