నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌..

నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌..

- షాక్‌లో తల్లి దండ్రులు, వరుడు

అమరావతి, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిదేహానికి కేజీహెచ్‌లో గురువారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు అందిన తర్వాత పీఎం పాలెం సీఐ రవికుమార్‌ మాట్లాడుతూ.. సృజన పాయిజన్‌ తీసుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని తెలిపారు. అయితే, పాయిజన్‌ ఎందుకు తీసుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, బుధవారం రాత్రి పెళ్లి సందర్భంగా నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతకు ముందు వధువు మృతిపై ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

Tags :