'కొడుకు' అమెరికా.. 'అయ్య' ఢిల్లీ.. !

'కొడుకు' అమెరికా.. 'అయ్య' ఢిల్లీ.. !

హైదరాబాద్, 21 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : జిత్తులమారి రాజకీయాలకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ మరో నాటకానికి తెరతీసినట్లు కనిపిస్తోంది.. ఇంతకాలం వేచిచూసిన గులాబీ పెద్దలు.. తమ కార్యాచరణకు తెరతీసినట్లు కనిపిస్తోంది.. ఇటీవల కాలంలో ఒక పద్ధతి, పాడు లేకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కేసీఆర్ అండ్ టీమ్ కి సరైన గుణపాఠం నేర్పాలని భావించారా..? అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు ప్రారంభించిందా..? ఈ దాడులనుంచి క్లీన్ చిట్ తో బయటపడాలని ప్రయతిస్తున్న కేసీఆర్ ముందుగా తన ముద్దుల తనయుడిని తప్పించడానికి, విదేశీ కంపెనీల పెట్టుబడులను తీసుకువచ్చే పేరుతో అమెరికాకు పంపించారు.. అయితే అసలు మతలబు వేరే ఉన్నట్లు తెలుస్తోంది.. బీజేపీ నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలను పసిగడుతూనే వుంది.. స్థానికంగా బినామీలుగా ఉన్నవారితో ప్రమాదమని తలంచిన కేసీఆర్ ఒక వ్యూహం తోనే కేటీఆర్ ని అమెరికా పంపించినట్లు తెలుస్తోంది.. ఇక్కడ బినామీలుగా వున్నవారి పేర్లను తొలగించి, ఎన్.ఆర్.ఐ. పారిశ్రామిక వేత్తలను అంటే గ్రీన్ హోల్డర్స్ ని భాగస్వాములుగా చేర్పిస్తే, ప్రమాదం కొంతమేర తగ్గే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో అక్కడివారితో వ్యవహారం నడపడానికి కేటీఆర్ అమెరికా వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఈ నెల 25 శుక్రవారం నాడు, సాయంత్రం 6 గంటలకు, షెర్టాన్ ఎడిషన్ లో, మెయిన్ బాల రూమ్, 125 రారిటన్ సెంటర్ పార్క్ వే, ఎడిషన్, ఎన్.జె. 08837 లో కేటీఆర్ ఎన్.ఆర్.ఐ. ప్రముఖులతో సమావేశమయ్యి.. వ్యవహారం పూర్తి చేయాలని పథకం వేసినట్లు తెలుస్తోంది.. ఇక కేసీఆర్ ఢిల్లీ ప్రయాణంలో బీజేపీ పెద్దలను కలిసి కాళ్ళా వేళ్ళా పడి, శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..      

కాగా తెలంగాణ‌ రాష్ట్రంలో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి..  అధికార పార్టీ నేత‌ల్లో గుబులు రేపుతున్నాయి.. గులాబీ పార్టీలో భయంతో కూడిన కారు మ‌బ్బులు క‌మ్మేశాయి.  అందుకేనెమో..? గులాబీ బాస్ మరోసారి మీడియా సాక్షిగా కేంద్రప్రభుత్వం మీద నిప్పులు కురిపించారు.. నెలతల్లిని న‌మ్ముకున్న రైతుల పేరుతో మ‌రోసారి ఢిల్లీ టూర్ కి ప్లాన్ వేశారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.. కాగా కేటీఆర్ గ్యాంగ్ ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తీసుకుని వచ్చెనందుకే  అమెరికా ప్ర‌యాణంలో ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా..  ఆదాయ‌పు పన్ను శాఖ సోదాలు, నోటీసులే దానికి కార‌ణ‌మ‌నే వాద‌న‌లు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు కూడా అవే కారణమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. అప్పట్లో  దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ రైతుల కోసం బీజేపీపై ఫైట్ చేశాయి. కానీ.. మన దొరవారు మాత్రం ఆ వైపు కన్నెత్తి  చూడలేదు. ఇప్పుడు మాత్రం తెలంగాణలో వ‌రి కొనుగోలుపై మొత్తం కేబినెట్ ని వెంట‌ పెట్టుకొని వెళ్లి ప్ర‌ధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  అయితే.. ఇదంతా 5 రోజులుగా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ స‌బ్ కాంట్ర‌క్ట్ కంపెనీ 'కేఎన్ఆర్ క‌న్ స్ట్ర‌క్ష‌న్ ' పై జరిగిన ఐటీ సోదాల ఎఫెక్ట్ అనే వాదన తెరపైకి వచ్చింది. సోదాల్లో భారీగా అవ‌క‌త‌వ‌క‌ల‌ను గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్స్ పై అధికారులు దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేటీఆర్ బినామీ కంపెనీల‌కు అక్ర‌మంగా నిధులు మ‌ళ్లించార‌ని అధికారులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కి నోటీసులు ఇచ్చే ప్ర‌య‌త్నం జరిగిందని.. ఈ విషయం తెలిసి హుటాహుటినా కేసీఆర్ అత్య‌స‌వ‌ర సమావేశం నిర్వ‌హించిన‌ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ చిన్న పామునైనా.. పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌ని చూసే ర‌కం. అందుకే మొగ్గ‌లోనే పెద్ద ఎత్తున లాబీయింగ్ అయినా చేయాలి.. లేదా.. యుద్ధానికైనా దిగాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి కేబినేట్ తో ప‌రేడ్ చేయిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు అన్నచందంగా తుగ్ల‌క్ రోడ్డుకు కేసీఆర్ టీమ్ చేరుకోబోతోందని అంటున్నారు విశ్లేషకులు.

కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న బీజేపీకి ఇన్నాళ్లూ పార్ల‌మెంట్ లో టీఆర్ఎస్ స‌హాయ స‌హాకారాలు అందిస్తూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ ని దేశంలో లేకుండా చేసేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. బయ‌ట‌కు వారి పాల‌సీ విధానాన్ని, మ‌త‌త‌త్వాన్ని టీఆర్ఎస్ ఎండ‌గ‌ట్టినా.. అది చివ‌రికి బీజేపీకే లాభం చేకూరుతోందని రాజ‌కీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో ముంద‌స్తు ఎన్నికల స‌మయంలో కాంగ్రెస్ మిత్ర ప‌క్షాల‌తో ఏదో చేయ‌బోతున్న‌ట్లు న‌టించారని.. ఇప్పుడు మళ్లీ గెలిచేందుకు అదే రాగం అందుకున్నారని అంటున్నారు. అయితే.. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బీజేపీ తెలంగాణ‌లో ప‌ట్టు సాధించాల‌ని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే క్రమంలో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ పై ఢిల్లీ పెద్ద‌లు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్ప‌ద భూముల‌ను క్లియ‌ర్ చేయ‌డంతో కేటీఆర్ కు ప‌రోక్షంగా పెద్ద మొత్తంలో డ‌బ్బులు ముట్టాయని.. అవి దుబాయి, లండ‌న్ లో పెట్టుబ‌డులుగా మారాయనే ఆరోపణలపై దృష్టి పెట్టారని సమాచారం. మొద‌ట‌గా ఇక్క‌డి ఇన్ఫ్రా కంపెనీల‌కు నోటీసులు జారీ చేసి.. దాడులు నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయని.. అందుకే అవన్నీ మ‌రుగున ప‌డేందుకే గులాబీ పార్టీ గులాంగిరి చేసేందుకు ప్ర‌యాణం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు రాజకీయ పండితులు.

గ‌తంలో అదాయ‌ప‌న్ను శాఖ మైంహోం, మేఘా కంపెనీలపై దాడులు నిర్వ‌హించింది. కానీ.. నేష‌న‌ల్ లెవ‌ల్ లో లాబీయింగ్ జరగడంతో ఎక్క‌డా న‌ష్టం వాటిళ్ల‌లేదు. సీ-5 కంపెనీల‌తో పాటు మ‌రిన్ని రియ‌ల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు జ‌రిగాయి. అయితే.. ఆ సమయంలో అంత సీరియ‌స్ గా తీసుకోలేదు. ఇప్పుడు చ‌ట్టాన్ని క‌ఠినంగా అమ‌లు చేస్తే ఐటీ శాఖ‌తో పాటు.. ఈడీ రంగంలోకి దిగే అవ‌కాశాలు ఉంటాయి. అందుకు పూర్తి ఆధారాలు ఇప్ప‌టికే ఫిర్యాదుల రూపంలో అంద‌డం.. ఎన్నిక‌ల టార్గెట్ గా పావులు క‌ద‌ప‌డంతో ఈసారి ఐటీ దాడుల‌కు వేరే అర్థాలు వెతుకుతున్నారు విశ్లేషకులు. ఇప్పుడు దాడులు నిర్వ‌హిస్తున్న అధికారులు ఎక్క‌వ మంది ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు కావ‌డంతో చాలా నోటీసులు, సోదాలు బయ‌ట‌కు పొక్క‌డం లేదు. పీక‌ల దాకా వచ్చాకే అన్ని బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ లాబీయింగ్ కోసమే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారని అంచనా వేస్తున్నారు.

Tags :